వికారాబాద్: గడువులోగా ఫ్లై ఓవర్ పనులు పూర్తవ్వాలి : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్: గడువులోగా ఫ్లై ఓవర్ పనులు పూర్తవ్వాలి : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
  •     అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్
  •     వికారాబాద్​లో పనులు పరిశీలన

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ పట్టణంలో ఫ్లై ఓవర్ పనులను గడువులోగా పూర్తి చేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత పనులను పరిశీలించారు. ఫ్లైఓవర్ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, నాణ్యతా ప్రమాణాలను పాటించేలా చూడాలన్నారు. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే ప్రజలకు రాకపోకలు సులువవడంతోపాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్​దీపక్​తివారీ, ఆర్డీవో వాసుచంద్ర, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కిషన్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

ధారూర్​మండలం అల్లీపూర్​సర్పంచ్​గొట్టిముకుల వీరేశం ఇటీవల ఆనారోగ్యంతో మృతిచెందగా.. బాధిత కుటుంబసభ్యులను స్పీకర్ ప్రసాద్​కుమార్​ పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, కెరెల్లి గ్రామంలో విద్యుత్​సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మోమిన్ పేట మండలంలోని వెల్ చాల్ గ్రామంలో శుక్రవారం రాత్రి షార్ట్​సర్క్యూట్​జరిగిన చర్చిని పరిశీలించారు. చర్చి పునర్నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.