Golden Globes 2024 Winners: ఏకంగా ఐదు అవార్డులు! స‌త్త‌చాటిన ఓపెన్‌హైమర్‌

Golden Globes 2024 Winners:  ఏకంగా ఐదు అవార్డులు! స‌త్త‌చాటిన ఓపెన్‌హైమర్‌

ప్రపంచ సినిమా రంగంలో ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డులను (Golden Globe Awards) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. 81వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల ప్రదానోత్సవం (జనవరి 7న) ఆదివారం రాత్రి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న బెవెర్లీ హిల్టన్ లో ఘనంగా జరిగాయి. 2023 ఏడాదికి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో రాజమౌళి డైరెక్ట్ చేసిన RRR మూవీ సత్తా చాటింది.

2024 కి గాను గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ లో హాలీవుడ్ మూవీ ‘ఓపెన్‌హైమర్‌’ సత్తా చాటింది. ఎనిమిది విభాగాల్లో నామినేటై ఏకంగా ఐదింటిలో అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం ‘ఓపెన్‌హైమర్‌' (డ్రామా) , ఉత్తమ దర్శకుడు (క్రిస్టఫర్‌ నోలన్‌), ఉత్త‌మ నటుడు( సిలియాన్ మర్ఫీ), ఉత్తమ సహాయ నటుడు (రాబర్ట్ డౌనీ), ఉత్త‌మ‌ ఒరిజినల్ స్కోర్ (లుడ్విగ్ గోరాన్సన్) విభాగాల్లో ఓపెన్‌హైమర్‌కు అవార్డులు అందుకుంది. 2023 జులై 21న రిలీజైన ఈ మూవీ $954 మిలియన్ల వసూలు చేసింది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో హాలీవుడ్ ప్ర‌ముఖులు సందడి చేశారు.

 

గోల్డెన్ గ్లోబ్‌ విజేతలు (Golden Globe Awards 2024 Winners List):

ఉత్తమ చిత్రం-ఓపెన్‌హైమర్‌
ఉత్తమ కామెడీ చిత్రం-పూర్‌ థింగ్స్‌
ఉత్తమ ఆంగ్లేతర చిత్రం-అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రం-ది బాయ్ అండ్ ది హెరాన్
బాక్సాఫీస్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు-వార్నర్ బ్రదర్స్ (బార్బీ)
ఉత్తమ దర్శకుడు-క్రిస్టఫర్‌ నోలన్‌ (ఓపెన్‌హైమర్‌)
ఉత్తమ స్క్రీన్‌ప్లే-జస్టిన్‌ సాగ్‌ ట్రైట్‌, ఆర్ధర్‌ హరారి (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
ఉత్తమ నటుడు-సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)
ఉత్తమ నటి-లిల్లీ గ్లాడ్‌స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్)
ఉత్తమ హాస్య నటి-ఎమ్మా స్టోన్ (పూర్‌ థింగ్స్‌)
ఉత్తమ హాస్య నటుడు-పాల్ గియామట్టి (ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయనటి-డావిన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయనటుడు-రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌-వాట్‌ వాస్‌ ఐ మేడ్‌ (బార్బీ)
ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌-లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్)