గడ్ పూర్ ఫారెస్ట్ లో  ఉత్సాహంగా గ్రీన్ ట్రయల్ రన్

 గడ్ పూర్  ఫారెస్ట్ లో  ఉత్సాహంగా గ్రీన్ ట్రయల్ రన్
  •     పాల్గొన్న 350 మంది వివిధ రాష్ట్రాలు, విదేశీయులు, మహిళా రన్నర్స్ 


మంచిర్యాల, వెలుగు: ఎకో టూరిజం, ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా మంచిర్యాల జిల్లా కవ్వాల్ ఫారెస్ట్​ పరిధిలోని గడ్‌‌‌‌‌‌‌‌పూర్ అడవుల్లో ఆదివారం నిర్వహించిన గ్రీన్ ట్రయల్ రన్‌‌‌‌‌‌‌‌ (జీటీఆర్‌‌‌‌‌‌‌‌)కు విశేష స్పందన లభించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన గ్రీన్ సెక్యూర్ ఫౌండేషన్, జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఫారెస్ట్ మారథాన్‌‌‌‌‌‌‌‌ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌‌‌‌‌‌‌‌తో పాటు జర్మనీ, ఆస్ట్రేలియాకు చెందిన 350 మంది రన్నర్లు పాల్గొన్నారు. జంగిల్ సఫారీ ఎంట్రీ పాయింట్ వద్ద ఉదయం 5.30 గంటలకు మంచిర్యాల ఎమ్మెల్యే కె.ప్రేమ్‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌రావు, ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరంద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ ఎస్.శాంతారాం, డీఎఫ్‌‌‌‌‌‌‌‌వో రాహుల్ కిషన్ జాదవ్ జెండా ఊపి మారథాన్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు.

5, 10, 30 కిలోమీటర్ల విభాగాల్లో జరిగిన రన్​లో చిన్నారులు, మహిళలు, వెటరన్ రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. 30 కిలోమీటర్ల విభాగంలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ గడమల్ల వెంకటేశ్ ఫస్ట్, మంచిర్యాలకు చెందిన సర్కిల్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ గడికొప్పుల సతీశ్ సెకండ్​ప్లేస్​సాధించారు. విజేతలతో పాటు రన్నర్లకు అటవీశాఖ ఆధ్వర్యంలో టీషర్టులు, మెమోంటోలు అందజేశారు. జిల్లాలోని అటవీ అందాలు టూరిస్టులను ఆకర్షిస్తున్నాయని, ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌పై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేందుకు ఇలాంటి మారథాన్లు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.