ఏసీ కంప్రెసర్ పై ఒక్క బకెట్ నీళ్లు పోయండి... కూలింగ్ డబుల్ అవ్వుద్ధి.. బిల్ తగ్గుద్ది..

ఏసీ కంప్రెసర్ పై ఒక్క బకెట్ నీళ్లు పోయండి... కూలింగ్ డబుల్ అవ్వుద్ధి.. బిల్ తగ్గుద్ది..

చాలా మంది ఎండ కాలంలో ఏసీ ఆన్ చేసినా రూమ్ చల్లగా అవ్వకపోతే.. ఏసీ పాడైపోయిందా లేదా కూలింగ్ డౌన్ అయిందా ఏంటి అని   కంగారుపడతారు. కానీ అసలు సమస్య లోపల కాదు, బయట ఉంటుంది. బయట ఎండలు 44 డిగ్రీలు దాటినప్పుడు, ఏసీ బయట ఉండే కంప్రెసర్ ఆ వేడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతుంది. దీనివల్ల ఏసీ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, దింతో కూలింగ్ తగ్గుతుంది, కరెంట్ బిల్లు కూడా పెరుగుతుంది. ఇలాంటప్పుడే ఒక్క బకెట్ నీళ్లతో మీ ఏసీ కూలింగ్‌ను మళ్లీ పెంచవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దామా....

ఏసీ లోపల ఉన్న వేడి గాలిని లాక్కుని, బయట ఉన్న అవుట్‌డోర్ యూనిట్ ద్వారా ఆ వేడిని బయటకు పంపుతుంది. బయట వాతావరణం అప్పటికే చాలా వేడిగా ఉన్నప్పుడు, ఏసీ లోపలి వేడిని బయటకు నెట్టడం దానికి కష్టమవుతుంది. అంటే ఏసీ కేవలం బయట ఉన్న తీవ్రమైన ఎండతో పోరాడలేక అలసిపోతుందన్నమాట.

ఒక బకెట్ నీళ్లు ఎలా పనిచేస్తాయి 
మీరు బయట ఉన్న ఏసీ కాయిల్స్ అంటే ఇనుప జాలి లాంటి భాగం పై నీళ్లు పోసినప్పుడు, ఆ నీరు ఆవిరైపోతూ కాయిల్స్ చుట్టూ ఉన్న వేడిని లాగేస్తుంది. మనకు చెమట పట్టినప్పుడు శరీరం ఎలా చల్లబడుతుందో, ఏసీ కూడా అలాగే చల్లబడుతుంది. దీనివల్ల కంప్రెసర్‌పై భారం తగ్గి, రూమ్  వేగంగా చల్లబడుతుంది. ఇంకా కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.

ఏసీ పాడవకుండా నీళ్లు ఎలా పోయాలి?
బయట ఉండే ఏసీ యూనిట్ వర్షాన్ని తట్టుకునేలాగే తయారవుతుంది, కాబట్టి నీళ్లకు అది పాడవ్వదు. కానీ లోపల ఉండే కరెంట్ వైర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

*మొదట మెయిన్ బోర్డ్ దగ్గర  ఏసీ స్విచ్‌ను పూర్తిగా ఆపేయండి.
*ఇప్పుడు ఒక బకెట్ నీళ్లు  తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ ఫోర్స్‌తో వచ్చే జెట్ వాటర్ స్ప్రే వాడకండి. ఏసీలో ఉండే అల్యూమినియం రెక్కలు చాలా పల్చగా ఉంటాయి,  కాబట్టి ఫోర్స్ ఎక్కువైతే అవి వంగిపోయి గాలి ఆడకుండా చేస్తుంది.
*ఇప్పుడు అవుట్‌డోర్ యూనిట్ పక్కల ఉండే మెటల్ జాలి పై మెల్లగా నీళ్లు పోయండి. వైర్లు ఉన్న చోట, కరెంట్ బాక్స్ ఉన్న వైపు నీళ్లు పడకుండా చూసుకోండి.
*నీళ్లు పోయడం అయిపోయాక కనీసం 30 నిమిషాలు ఆగండి. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాతే ఏసీని మళ్లీ ఆన్ చేయండి.

డబ్బులు ఎలా ఆదా అవుతాయంటే 
ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీ రూమ్ చల్లబరచడానికి ఎక్కువ సమయం కంప్రెసర్‌ను రన్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల కరెంట్ మీటర్ వేగంగా తిరుగుతుంది. మనం నీళ్లతో అవుట్ డోర్  యూనిట్‌ను చల్లబరిచినప్పుడు, కంప్రెసర్ త్వరగా  పని పూర్తి చేసుకుని రెస్ట్ తీసుకుంటుంది. ఇలా చేయడం వల్ల రోజుకు 8 గంటలు ఏసీ వాడే ఇళ్లలో కరెంట్ వినియోగం 10 నుండి 15 శాతం వరకు తగ్గుతుంది. అలాగే కాయిల్స్ పై ఉన్న దుమ్ము, ధూళి కొట్టుకుపోయి ఏసీ లైఫ్ కూడా పెరుగుతుంది. ఎండ కాలంలో వారానికి ఒకసారి ఇలా చేస్తే మీ ఏసీ సూపర్ గా పనిచేస్తుంది.