హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) 2026–-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్ఏటీఎస్) పోర్టల్ ద్వారా సెప్టెంబర్ 16లోగా అప్లై చేసుకోవచ్చు.
పోస్టు పేరు: అప్రెంటిస్.
మొత్తం ఖాళీలు: 106.
విభాగాల వారీగా ఖాళీలు
డిప్లొమా (ఇంజినీరింగ్) 79: మెకానికల్ 39, కెమికల్ 13, మెటలర్జికల్ 3, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 14, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 2, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 4, సివిల్ 4.
గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్) 29: మెకానికల్ 16, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 4, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 3, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 2, కెమికల్ 2.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు లేదా ప్రైవేట్ సంస్థల్లో ఇప్పటికే అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసినవారు లేదా ప్రస్తుతం కొనసాగుతున్న అభ్యర్థులు అర్హులు కాదు. అలాగే, పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) అర్హత కలిగిన అభ్యర్థులు కూడా అర్హులు కాదు.
వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 24.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 16.
సెలెక్షన్ ప్రాసెస్: ఎలాంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్, వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ nats.education.gov.inను సందర్శించండి.
