- హైదరాబాద్‌లో మళ్లీ ఐమాక్స్
హైదరాబాద్, వెలుగు: ఐమాక్స్ కార్పొరేషన్, ఏషియన్ సినిమాస్ సంస్థలు మూడు కొత్త ఐమాక్స్ థియేటర్లను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏఎంబీ సినిమాస్ బ్రాండ్ ద్వారా ఈ ఐమాక్స్ లేజర్ థియేటర్లు అందుబాటులోకి వస్తాయి. వీటిలో రెండు థియేటర్లను హైదరాబాద్‌లోనే నిర్మిస్తారు. మొదటి థియేటర్ హైదరాబాద్‌లోని ఏఎంబీ క్లాసిక్‌లో ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం కానుంది. మిగిలిన రెండు థియేటర్లను 2028లో నిర్మిస్తారు. ప్రసాద్స్ ఐమాక్స్ 2015లో మూతపడిన తర్వాత నగరానికి ఐమాక్స్ తిరిగి రావడం ఇదే మొదటిసారి. ఈ కొత్త థియేటర్లలో అత్యాధునిక 4కే ప్రొజెక్షన్ టెక్నాలజీ ప్రేక్షకులకు అద్భుత అనుభూతిని ఇస్తుందని ఐమాక్స్ తెలిపింది.
