ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్ విద్యార్థులకు ఫ్రీ ట్రైనింగ్, జాబ్..

 ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్ విద్యార్థులకు ఫ్రీ ట్రైనింగ్, జాబ్..

ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో స్థిరపడాలనుకునే అవివాహిత పురుష అభ్యర్థులకు సువర్ణావకాశం. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (టీఈఎస్–56) ద్వారా మొత్తం 90 ఖాళీల భర్తీకి భారత సైన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (పీసీఎం) సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి, జేఈఈ మెయిన్స్–2026 పరీక్షకు హాజరైన యువకులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నాలుగేళ్ల ఉచిత మిలిటరీ & ఇంజినీరింగ్ శిక్షణను అందించి, అనంతరం ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో శాశ్వత కమిషన్ కల్పిస్తారు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు మే 13 నుంచి జూన్ 12 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టు పేరు: టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్–56).

మొత్తం ఖాళీలు: 90. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో 10+2 లేదా సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 12వ తరగతిలో పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ పర్సెంటేజ్‌ను లెక్కిస్తారు. అభ్యర్థి తప్పనిసరిగా జేఈఈ (మెయిన్స్)–2026కు హాజరై ఉండాలి. బీఈ/ బి.టెక్  కోర్సుల కోసం జేఈఈ  మెయిన్స్– 2026 అప్లికేషన్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అవివాహితులైన పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలి. శిక్షణ పూర్తయ్యే వరకు వివాహం చేసుకోమని హామీ ఇవ్వాలి.

వయోపరిమితి: 16.5 సంవత్సరాల నుంచి 19.5 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే 2007, జులై 1 నుంచి 2010, జులై 1 మధ్య జన్మించిన వారై ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మే 13.

లాస్ట్ డేట్: జూన్ 12.

షార్ట్ లిస్ట్: 2025, జులై మొదటి వారం. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ joinindianarmy.nic.inను సందర్శించండి.

సెలెక్షన్ ప్రాసెస్
స్టేజ్–1 షార్ట్ లిస్ట్
జేఈఈ మెయిన్స్– 2026 కామన్ ర్యాంక్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. 2026, జులై మొదటి వారంలో షార్ట్ లిస్ట్ జాబితాను వెలువరిస్తారు. 

స్టేజ్–2 ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ
స్టేజ్–I: సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఉంటాయి.  ఇందులో విఫలమైన అభ్యర్థులను అదే రోజున వెనక్కి పంపుతారు.
స్టేజ్-–II: స్టేజ్–Iలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే రెండో దశకు వెళ్తారు. ఈ దశలో గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఉంటుంది.

ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ కేంద్రాలు: ప్రయాగ్​రాజ్ (యూపీ), భోపాల్ (ఎంపీ), బెంగళూరు (కర్ణాటక), జలంధర్ (పంజాబ్). 

ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ: 2026, ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు.

స్టేజ్–3లో మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత స్టేజ్–4లో మెరిట్ లిస్ట్ ప్రకటించి జాయినింగ్ లెటర్ అందజేస్తారు. 

ట్రైనింగ్​
ప్రీ-కమిషన్డ్ ట్రైనింగ్ అకాడమీల్లో నాలుగేళ్లు (3+1) శిక్షణ ఉంటుంది. 
ఫేజ్-–Iలో సీఎంఈ పుణె/ ఎంసీటీఈ మౌ/ ఎంసీఈఎంఈ సికింద్రాబాద్​లోని క్యాడెట్స్ ట్రైనింగ్ వింగ్స్​లో మూడేళ్లు ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ & ఇంజినీరింగ్ ట్రైనింగ్ ఉంటుంది. 

ఫేజ్–-IIలో డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ)లో ఏడాది ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ & ఇంజినీరింగ్ ట్రైనింగ్ ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత  క్యాడెట్లకు ఇంజినీరింగ్ డిగ్రీని ప్రదానం చేసి, లెఫ్టినెంట్ హోదాలో శాశ్వత కమిషన్ మంజూరు చేస్తారు.