పాత కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిపేర్లు.. కొత్త కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సొబగులు 

 పాత కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిపేర్లు.. కొత్త కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సొబగులు 

కరీంనగర్, వెలుగు: ప్రస్తుతం జిల్లా యంత్రాంగం కార్యకలాపాలు నిర్వహిస్తున్న కరీంనగర్ పాత కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిపేర్లు చేపట్టారు. ఫ్లోరింగ్ దెబ్బతినడం, పలుచోట్ల పెచ్చులూడడంతో వాటిని తొలగించి రిపేర్లు చేస్తున్నారు. అయితే మరికొద్ది నెలల్లోనే కొత్త కలెక్టరేట్ నిర్మాణం పూర్తయి.. పాత కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా కూల్చివేస్తారని అంతా భావిస్తున్న టైంలో పాత కలెక్టరేట్ భవనంలో రిపేర్లు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. 

అయితే ప్రస్తుత భవన పటిష్టతను బట్టి మరో 30, 40 ఏళ్లు వినియోగించుకోవచ్చని, అనవసరంగా కోట్లాది రూపాయలు విలువ చేసే భవనాన్ని కూల్చడం ఎందుకుని కలెక్టర్ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ప్రస్తుతానికి అవసరమైన రిపేర్లు చేపట్టినట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు కలెక్టరేట్ కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి. సీలింగ్, ఎలక్ట్రిసిటీ పనులు, ఆరు బయట ఫ్లోరింగ్ పనులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. కలర్ ఒక కోటింగ్ వేసినప్పటికీ మరోసారి వేయాల్సి ఉంది. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి.