
నేను శైలజతో ఎంట్రీ ఇచ్చి..నేను లోకల్ తో పక్కంటి అమ్మాయిగాపేరొంది..మహానటితో మెరిసిన కీర్తి సురేష్..టాలీవుడ్ లో తనకంటే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. వరుస సినిమాలు చేస్తూ హిట్ ల మీద హిట్లు కొడుతోంది. అందం..అభినయం కలగలిసిన కీర్తి సురేష్ కు కాబోయే వరుడు ఎలా ఉంటాడు..ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..అని అని అభిమానులు తెగ ఆలోచించారు. అయితే తాజాగా కీర్తి సురేష్ కు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. అంతేకాదు..కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ ఇతడే అంటూ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి.
కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్..
కీర్తి సురేశ్ ఇటీవల ఓ వ్యక్తితో ఫోటోలు తీసుకుంది. అయితే ఈ ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో వెంటనే ఇవి వైరల్ అయ్యాయి. ఈ బ్యూటీ సీక్రెట్ గా ఉంచిన బాయ్ ఫ్రెండ్ ఇతడేనంటూ సోషల్ మీడియాల్ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది. ఈ సారి నా బెస్ట్ ఫ్రెండ్ ని కూడా ఇందులోకి లాగేశారా? అంది నవ్వుతూ...
నేనే చెప్తా...
నా జీవితంలో నిజమైన మిస్టరీ మ్యాన్ గురించి సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానంటూ.. అప్పటివరకు చిల్ అవ్వండని కీర్తి తెలిపింది. ప్రస్తుతం వస్తున్న వార్తలన్ని నిజం కాదని ట్వీట్ చేసింది. దీంతో ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి తన బెస్ట్ ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చినట్లైంది. అయితే, తన లైఫ్‌లో ఉన్న మిస్టరీ మ్యాన్ ఎవరో చెప్పాలంటూ ఈ ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కీర్తి ప్రేమలో ఉందని ఓ సారి.. ఓ బిజినెస్ మ్యాన్‌తో తన పెళ్లి జరగనుందని మరోసారి పలురకాలుగా నెట్టింట వార్తలు షికార్లు చేస్తున్నాయి.