బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన రక్షాబంధన్ యాడ్ గత కొద్దిరోజులుగా పెద్ద దుమారమే రేపుతోంది. ఈ యాడ్‌లో ఆమె బ్రాలెట్ తరహా బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్‌తో ఆమె కనిపించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తన డ్రెస్‌తో పాటు పెంపుడు కుక్కకు రాఖీ కట్టడంపై కూడా విమర్శలు వచ్చాయి. భారతీయ సంప్రదాయానికి ఇది అవమానకరం అంటూ పెద్ద ఎత్తున ఆమెను ట్రోల్ చేశారు.
ఈ విమర్శలపై కృతి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఘాటుగా స్పందించారు. పండగల స్ఫూర్తిని వస్త్రధారణతో ముడిపెట్టడం సరికాదని, మహిళల దుస్తుల ఆధారంగా వారి సంస్కృతి, సంప్రదాయాలపై తీర్పులు ఇవ్వడం ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందని ఆమె ప్రశ్నించారు.
‘సంస్కృతి, సంప్రదాయాలు మహిళ హృదయంలో ఉంటాయి కానీ ఆమె దుస్తుల నెక్‌లైన్‌లో కాదు’ అంటూ ఆమె స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. రక్షాబంధన్ ఒకరికొకరు అండగా నిలిచే అనుబంధానికి ప్రతీక అని.. తాను, తన సోదరి ప్రతి ఏడాది రాఖీ కట్టుకుంటామని చెప్పారు. అలాగే పెంపుడు కుక్కలను కూడా ఫ్యామిలీలో ఓ భాగంగానే భావిస్తామని పేర్కొన్నారు.
Everyone trolling Kriti Sanon for this GIVA ad, saying she’s wearing a “bikini.” Is she? Nope.
— Ritzz (@ChaoticRitzz) August 23, 2026
She’s not dressed inappropriately.
Maybe her outfit just doesn’t fit your definition of “decency.” I could wear that in front of my brother too.
Same people cheering her bikini… pic.twitter.com/65aSejJLFU
మరోవైపు కృతి సనన్ వస్త్రధారణపై నటి, ఎంపీ కంగనా రనౌత్ కూడా స్పందించారు. ‘‘ఈ రోజుల్లో మహిళలకు లెహంగా చోళీల నుంచి జీన్స్ వరకు, చీరల నుంచి బికినీల వరకు ఎన్నో ఆప్షన్లు మనకు ఉన్నప్పుడు, మీ సోదరుడికి బికినీ / లోదుస్తులలో వెళ్లి రాఖీ కట్టడం ఏమిటి? మీ స్టైలింగ్ ఆప్షన్లన్నీ ఎక్కడికి పోయాయి? ఈ యాడ్ ఉద్దేశపూర్వకంగానే చేసినట్టుంది. అసహ్యంగా కనిపిస్తోంది” అని కంగన అభిప్రాయపడ్డారు.
