ఆస్పత్రిలో చేరిన అమెరికన్ గాయని మడోన్నా

ఆస్పత్రిలో చేరిన అమెరికన్ గాయని మడోన్నా

అమెరికన్ గాయని మడోన్నా ఆస్పత్రి పాలయింది. జూన్ 24న న్యూయార్క్ నగరంలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌కు తరలించామని ఆమె మేనేజర్ గై ఓసీరీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 64 ఏళ్ల గాయకురాలిని ఆసుపత్రికి తరలించిన తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి ఆమెకు ఇంట్యూబేషన్ చేశారని చెప్పుకొచ్చారు.

"మడోన్నాకు తీవ్రమైన బ్యాక్టీరియా సంక్రమించింది.. దీని వల్ల ఆమె మరికొన్ని రోజులు ICU లో ఉండే అవకాశం ఉంది" అని ఆమె మేనేజర్ గై ఓసీరీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఆమె ఇంకా వైద్య సంరక్షణలో ఉందని ఆయన చెప్పారు. ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో మడోన్నా.. ప్రపంచ యాత్రతో పాటు అన్ని కమిట్ మెంట్లు ఆగిపోయాయని గై ఓసీరీ స్పష్టం చేశారు. త్వరలోనే పర్యటనకు సంబంధించిన తేదీ, రీషెడ్యూల్ చేసిన షోలతో పాటు మరిన్ని వివరాలను వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు.

https://www.instagram.com/p/CuC6w1TPH_l/?utm_source=ig_embed&ig_rid=172969bb-6fa6-421b-ac7d-17a4889dfe5f