ఇంటర్నెట్ ను షేక్ చేస్తోన్న 'మ్యాంగో ఆమ్లెట్' రెసిపీ.. అసలు దీన్ని ఎవరైనా తింటారా ?

ఇంటర్నెట్ ను షేక్ చేస్తోన్న 'మ్యాంగో ఆమ్లెట్' రెసిపీ.. అసలు దీన్ని ఎవరైనా తింటారా ?

మామిడి పండ్లతో ఆమ్లెట్‌.. ఈ కాంబినేషన్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా... ఈ డెడ్లీ కాంబినేషన్ పేరు చెప్పగానే అసలు అది ఉంటుందోనని పలు విధాలుగా ఊహించుకుంటూ ఉంటారు. అసలు మ్యాంగో ఆమ్లెట్ అనే వంటకం ఉంటుందా అని ఆశ్చర్య వ్యక్తం చేస్తుంటారు ఇంకొందరు. కానీ సోషల్ మీడియాలో ఈ రెసిపీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో వీధి వ్యాపారి మొదటగా వేయించిన గుడ్లను నూనెలో వేయిస్తాడు. తరువాత, అతను రెండు గుడ్డు సొనలు తీసుకుని, తవాలో మిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వాటిని మెత్తగా చేయడం ప్రారంభిస్తాడు. ఈ మిశ్రమంలో మజా డ్రింక్ ను జోడించి, కొన్ని నిమిషాలు ఉడికిస్తాడు. దీన్ని ముందుగా చేసి పెట్టుకున్న ఆమ్లెంట్ పైన పోస్తాడు.  దానికి ఉప్పు, ఇతర మసాలా దినుసులతో పాటు మరో బాటిల్ మాజాను జతచేస్తాడు. ఆ తర్వాత గుడ్డులోని పచ్చసొన, తెలుపు మిశ్రమాలతో వేయించిన మిశ్రమాన్ని టాప్స్ గా డెకరేట్ చేసి, దానిపై చీజ్ ను జోడించి రెసిపీకి మరింత అట్రాక్షన్ ను తీసుకువస్తాడు.

ఈ ఫుడ్ రెసిపీని ది గ్రేట్ ఇండియన్ ఫుడీ పేజీలో షేర్ చేయగా.. ఈ వీడియోకు ఇప్పటివరకు 8లక్షల కంటే ఎక్కువ వ్యూస్, 9వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వెరైటీ వీడియోపై నెటిజన్లు కూడా పలు రకాలుగా స్పందిస్తున్నారు. రకరకాల ఆహారాన్ని అందిస్తున్న ఆహార విక్రయదారులపై సరైన తనిఖీ అవసరమని భావిస్తున్నానని ఓ యూజర్ ఆందోళన వ్యక్తం చేయగా.. కొన్ని ఆహార కలయికలు ఆరోగ్యానికి వినాశకరమైనవి కావచ్చని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వాలి కానీ అందుకు మా జీవితాలను పణంగా పెట్టలేం అని ఇంకొందరు అంటున్నారు.

https://www.instagram.com/reel/CsGWYR3Jv6Y/?utm_source=ig_embed&ig_rid=a849f359-ab96-4c1e-b42f-fbeeeb271b9d