ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో దురుసుగా మాట్లాడిన అటవీశాఖ అధికారి

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో దురుసుగా మాట్లాడిన అటవీశాఖ అధికారి

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరాంచర్లలో కోతుల సమస్యను తీర్చాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) కొండల్ రెడ్డికి ఫోన్ చేశారు. అటవీశాఖ అధికారి ఎమ్మెల్యేకు సరైన సమాధానం చెప్పకుండా దురుసుగా మాట్లాడారు. ఏం చేసుకుంటారో చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. కోతుల బెడద నుంచి గ్రామస్తులకు విముక్తి కల్పించాలని అడిగితే అటవీశాఖ అధికారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటవీశాఖ అధికారి కొండల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చిన్నరాంచర్ల గ్రామ సభలో తీర్మానం చేశారు. ఈ మేరకు గ్రామ సభ నుంచే జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫిర్యాదు చేశారు. చిన్నరాంచర్లకు వెళ్లిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కోతుల సమస్య తీర్చాలని గ్రామస్తులు విన్నవించారు. దీనిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి FRO కొండల్ రెడ్డిని ఫోన్ లో నిలదీశారు.