
జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ బ్యానర్‌పై సంజోష్ తగరం నిర్మిస్తున్న చిత్రం ‘మై లవ్’. ఈ మూవీ పోస్టర్‌ను మినిస్టర్ శ్రీధర్ బాబు లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా సంజోష్ మాట్లాడుతూ ‘మా పోస్టర్ మంత్రి గారి చేతులమీదుగా లాంచ్ చేయడమే మా మొదటి విజయం. ఇప్పటివరకు లవ్‌లో ఎవరూ టచ్ చేయని కొత్త పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. చాలా కొత్తగా ఉంటుంది’ అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లేతకారి రాజబాబు, కో ప్రొడ్యూసర్ ఆర్ వి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.