కరోనా కొత్త వేరియంట్ 'సికాడా' (BA.3.2): ప్రపంచానికి ముప్పు ? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే ?

కరోనా కొత్త వేరియంట్ 'సికాడా' (BA.3.2): ప్రపంచానికి ముప్పు ? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే ?

కరోనా వైరస్ మళ్లీ దాని రూపాన్ని మార్చుకుంది. లేటెస్ట్ గా BA.3.2 అనే కొత్త సబ్-వేరియంట్ వెలుగులోకి వచ్చింది. దీనికి శాస్త్రవేత్తలు 'సికాడా' (Cicada) అని పేరు పెట్టారు. ప్రస్తుతం అమెరికా, దక్షిణాఫ్రికా, యూరప్ వంటి దేశాల్లో ఈ సికాడా వైరస్ కనిపిస్తోంది. దింతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిపై నిఘా పెంచింది.

అసలు ఈ సికాడా వేరియంట్ ఏంటి:
సికాడా వేరియంట్ పాత ఒమిక్రాన్ కుటుంబానికి చెందినదే. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇందులో సుమారు 70కి పైగా మార్పులు (Mutations) జరిగాయి. ఇంత భారీ స్థాయిలో వైరస్ రూపం మార్చుకోవడం వల్ల  వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ బయటపడటంతో దీనికి 'సికాడా' అని పేరు పెట్టారు.

లక్షణాలు :
ప్రస్తుతానికి దీని లక్షణాలు పాత ఒమిక్రాన్ వేరియంట్ లాగే ఉన్నాయి. ఎక్కువగా టీకా వేయించుకున్న వారిలో తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి, విపరీతమైన అలసట, నీరసం, ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, తేలికగా జ్వరం ఇవి తక్కువగానే కనిపిస్తున్నాయి. చాల అరుదుగా వాసన ఇంకా రుచి కోల్పోవడం లేదా రాత్రిపూట చెమటలు పట్టడం కనిపిస్తుంది, 

 ఎంతవరకు ప్రమాదకరం:
శాస్త్రవేత్తల  అంచనాల ప్రకారం.. ఈ వైరస్ పాత వేరియంట్ల కంటే కొంచెం వేగంగా వ్యాపించవచ్చు. గతంలో కరోనా వచ్చిన వారికి లేదా టీకా తీసుకున్న వారికి ఉండే రోగనిరోధక శక్తిని  కొంతవరకు తప్పుదోవ పట్టించవచ్చు.

అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ వేరియంట్ వల్ల ప్రమాదం పెరగడం గానీ, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రావడం గానీ జరుగుతున్నట్లు ఎక్కడా రుజువు కాలేదు. ఇంకా  సాధారణ జలుబు, జ్వరం లాగే వచ్చి వెళ్తోంది.

మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
 కొత్త వేరియంట్ వచ్చింది అనగానే భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉంటే చాలు. బూస్టర్ డోస్ తీసుకోని వారు తీసుకోవడం మంచిది. దీని వల్ల  తీవ్రమైన అనారోగ్యం కలగకుండా రక్షణ ఇస్తుంది.

 జన హుంపులుగా ఎక్కువగా ఉన్న చోట మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి  పద్ధతులను పాటిస్తే మంచిది. జ్వరం, దగ్గు తగ్గకపోతే వెంటనే డాక్టరును సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. కరోనా ఇంకా పూర్తిగా పోలేదని, రూపం మార్చుకుంటూనే ఉంటుందని 'సికాడా' వేరియంట్ గుర్తు చేస్తోంది. అయితే ప్రస్తుతానికి దీనివల్ల ప్రపంచానికి వచ్చే ముప్పేమీ లేదని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి.