‘NBK111’ ఊచకోత గ్లింప్స్ రిలీజ్.. బాలయ్య పుట్టినరోజున 'న్యూ ఏజ్' విధ్వంసం!

‘NBK111’ ఊచకోత గ్లింప్స్ రిలీజ్.. బాలయ్య పుట్టినరోజున 'న్యూ ఏజ్' విధ్వంసం!

నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) వస్తే తెలుగు రాష్ట్రాల్లో అభిమానులకు అదొక పెద్ద పండుగ. ఈ ఏడాది బాలయ్య బాబు తన 66వ పుట్టినరోజును జరుపుకుంటుండటంతో థియేటర్ల దగ్గర, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. అయితే, ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను నెక్స్ట్‌ లెవెల్‌కు  తీసుకెళ్లారు. బాలయ్య 'NBK111'  గ్లింప్స్ ను 'ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా' పేరుతో  రిలీజ్ చేశారు  మేకర్స్.

ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా విధ్వంసం!

గతంలో బాలయ్యతో 'వీరసింహారెడ్డి' లాంటి భారీ బ్లాక్‌బస్టర్ అందించిన మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ 'NBK111' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ చూస్తుంటే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. 'ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా' అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టే, బాలకృష్ణను మునుపెన్నడూ చూడని ఒక మోస్ట్ స్టైలిష్, పవర్‌ఫుల్  అవతార్‌లో గోపీచంద్ ప్రెజెంట్ చేశారు. ఈ గ్లింప్స్‌లో బాలయ్య, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేశాయి.

ముంబై నేపథ్యంలో చిత్రీకరించిన ఈ సినిమా బాలకృష్ణకు ఉన్న మాస్ అప్పీల్ ను మరింత హైలైట్ చేస్తుంది. ఈ గ్లింప్స్ వీడియోలో  నోట్లో సిగరెట్ పెట్టుకుని బుల్లెట్ బైక్ పై  బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. రౌడీలతో ఈ ఫైట్ సీన్ చూస్తుంటే ఈ మూవీ మరో యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) అయితే థియేటర్లలో స్పీకర్లు పగిలిపోయేలా ఉంది.

భారీ తారాగణంతో..

వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు కాజల్ అగర్వాల్ కూడా నటిస్తుంది.. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్స్ లో మెరవనుంది.  ఇక ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలకృష్ణను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో వెర్సటైల్ యాక్టర్ మంచు మనోజ్ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అరవింద్ కశ్యప్ ఈ చిత్రానికి అద్భుతమైన విజువల్స్ అందిస్తున్నారు.

►ALSO READ | Irumudi: ‘బంగారు పల్లకితో’ పాటు మరో స్పెషల్.. భక్తులకు గూస్‌బంప్స్ వచ్చేలా జీవీ ట్యూన్స్!

బాలయ్యను కలిసి విషెస్ చెప్పిన టీమ్..

ఈ హైప్ ఇలా ఉంటే.. గ్లింప్స్ లాంచ్‌కు ముందే చిత్ర యూనిట్ అంతా కలిసి బాలకృష్ణను స్వయంగా కలిసి బర్త్ డే విషెస్ తెలియజేసింది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, ప్రొడ్యూసర్ వెంకట సతీశ్ కిలారు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్‌లు బాలయ్య నివాసానికి వెళ్లి కేక్ కట్ చేయించి సందడి చేశారు. ఈ సందర్భంగా సినిమా అవుట్‌పుట్ పట్ల బాలయ్య ఎంతో సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ బర్త్ డే గ్లింప్స్‌తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టడానికి 'NBK111' టీమ్ పక్కా ప్లాన్‌తో రెడీ అయిపోయింది..