బార్లో బీజేపీ నేత లాలా.. మహిళా డ్యాన్సర్లతో లలలా.. వీడియో వైరల్

బార్లో బీజేపీ నేత లాలా.. మహిళా డ్యాన్సర్లతో లలలా.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత బార్ లో చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు బార్ గర్ల్స్ తో డ్యాన్స్ చేస్తున్న వీడియో చక్కర్లు కొడుతోంది. మహిళలతో సినిమా డ్యాన్సును మించి.. కాస్త అసభ్యకరంగా చేస్తున్న డ్యాన్స్ క్లిప్పులు సోషల్ మీడియా అంతా సర్క్యులేట్ అవుతున్నాయి. దీంతో అది ఏఐ వీడియో అని తన శత్రువులు తన క్యారెక్టర్ డ్యామేజ్ చేయడానికి ప్రచారం చేస్తున్నారంటూ వివరణ ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. 

ఝాన్సీ కి చెందిన బీజేపీ నేత ఆదర్శ్ శర్మ లాలా.. అసభ్యకరంగా బార్ డ్యాన్సర్లతో డ్యాన్స్ లో మునిగిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. అయితే డిజిటల్ గా.. ఏఐ తో జనరేట్ చేసిన వీడియో అని అన్నారు లాలా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా నిరుపయోగం అవుతుందో ఈ వీడియో ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. 

ఎప్పుడు తీశారో డీటెయిల్స్ లేని ఈ వీడియో సోషల్ ప్లాట్ ఫామ్స్ అయిన ఎక్స్, ఫేస్ బుక్, వాట్సాప్ మొదలైన వాటిలో వైలర్ గా మారింది. యూజర్లు కామెంట్ల మీద కామెంట్లు పోస్టు  చేస్తున్నారు.ఈ వీడియో వైరల్ కావడంతో లాలాపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 

వివాదం గురించి మాట్లాడిన లాలా.. ఆ వీడియో తనది కాదని అన్నారు. తనపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. ఏఐ ఉపయోగించి చేసిన వీడియోపై విమర్శలు చేయడం తగదన్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోను చూసి నమ్మొద్దన్నారు. తన గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో ఫ్యాబ్రికేట్ చేసిన వీడియోనని ఆరోపించారు. అయితే ఈ వీడియోపై ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయలేదని తెలస్తోంది.