మెట్రోలో ప్రధాని మోదీ, సీఎం విజయ్ జర్నీ

మెట్రోలో ప్రధాని మోదీ, సీఎం విజయ్ జర్నీ

చెన్నై నగర ప్రజలకు గుడ్ న్యూస్. చెన్నై మెట్రో రైలు  సెకండ్ ఫేజ్ లో  భాగంగా, పూనమల్లి నుంచి వడపళని వరకు నిర్మించిన కొత్త మెట్రో మార్గం ప్రారంభమైంది. ఈ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,తమిళనాడు సీఎం విజయ్ తో కలిసి ప్రారంభించారు. సుమారు4 వేల900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ మెట్రో మార్గం దాదాపు 15 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. ఇందులో 11 ఎత్తైన మెట్రో స్టేషన్లు ఉన్నాయి.

ఈ కొత్త మార్గం అందుబాటులోకి రావడంతో చెన్నై పశ్చిమ ప్రాంతాల నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణించడం మరింత సులభం కానుంది. ముఖ్యంగా రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది. 

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రో ప్రాజెక్టు వివరాలను అధికారులు వారికి వివరించారు.

ఈ మార్గంలో ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు, భవిష్యత్తులో డ్రైవర్‌లెస్ రైళ్ల నిర్వహణకు అనువైన సాంకేతిక సదుపాయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కారిడార్‌లో సుమారు 3.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.