నా పోర్షన్ కంప్లీట్.. జన నాయగన్ మూవీపై పూజా హెగ్దే బిగ్ అప్డేట్

నా పోర్షన్ కంప్లీట్.. జన నాయగన్ మూవీపై పూజా హెగ్దే బిగ్ అప్డేట్

ఫలితం ఎలా ఉన్నా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది పూజా హెగ్డే.  ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఆమె  నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రంలో తన పోర్షన్ షూట్ కంప్లీట్ అయ్యిందని అప్‌‌డేట్ ఇచ్చింది పూజ. చెన్నైలో ఫైనల్ షెడ్యూల్ షూటింగ్  జరుగుతోందని, సోమవారంతో తన క్యారెక్టర్‌‌‌‌కు సంబంధించిన  షూట్ మొత్తం పూర్తయిందని తెలియజేసింది. ఈ సందర్భంగా సెట్‌‌లో ఉన్న తన ఫొటోను ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసింది. కోలీవుడ్ స్టార్ విజయ్‌‌కు జంటగా ఇందులో నటిస్తోంది పూజా హెగ్డే.  హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

పొలిటికల్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ విప్లవాత్మక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.  బాబీ డియోల్, మమితా బైజు, ప్రియమణి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యగదీష్ పళనిస్వామి, లోహిత్ కలిసి కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు పూజా హెగ్డే.. ప్రస్తుతం లారెన్స్ ‘కాంచన4’,  రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలో స్పెషల్ అప్పీరియెన్స్ ఇవ్వబోతోంది. అలాగే హిందీలో వరుణ్ ధావన్‌‌కు జంటగా ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ చిత్రం చేస్తోంది.