కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధుల అరెస్టును తీవ్రంగా ఖండించారు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. సీజేపీ లీడర్స్ సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలకు ఐదు రోజుల జుడీషియల్ కస్టడీ విధించడంపై స్పదించిన రాహుల్.. వారి అరెస్టు పరికిపంద చర్యగా అభివర్ణించారు.
సీజేపీ లీడర్స్ అరెస్టు, జుడీషియల్ కస్టీడీ విధింపుపై 2026 అక్టోబర్ 14న ఎక్స్ లో ట్వీట్ చేశారు రాహుల్. జంతర్ మంతర్ దగ్గర మూడు రంగుల జెండాను పట్టుకుని శాంతియుత నిరసన చేయడం తప్పుకాదని అన్నారు. యువను జైళ్లో పెట్టడం పిరికిపంద చర్య అని మండిపప్డారు.
స్టూడెంట్స్, యువత, జర్నలిస్లు, ఇండియా బ్లాక్ నేతలు వేర్వేరు జెండాల కింద పనిచేయవచ్చు కానీ.. అన్ని ఆందోళనల లక్ష్యం ఒకటే . పౌరుల రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడమే తమ అజెండా అని అన్నారు. జెండాలు వేరైనా అజెండాలు అంరివివీ ఒకటి అని అన్నారు.
జంతర్ మంతర్ అనేది భారత ప్రజలకు చెందిన స్థలం అని అన్నారు. తమ హక్కులు సాధించుకోవడం కోసం శాంతి యుతంగా ఆందోళనలు తెలిపే వేదిక అని అన్నారు. జంతర్ మంతర్ ను రీ్టోర్ చేయాలన డిమాండ్ చేశారు.
Waving the Tricolour at Jantar Mantar in a peaceful protest is not a crime. Jailing youth for it is an act of cowardice. Students. Youth. Journalists. The INDIA bloc. Different banners, one cause. All protests are one: citizens demanding their constitutional rights. Jantar Mantar belongs to the people of India. We will reclaim it.
— Rahul Gandhi (@RahulGandhi) October 14, 2026
అంతకు ముందు , అక్టోబర్ 10న ఒప్పందాలను ఉల్లంఘించినందుకు, ఎటువంటి అనుమతి లేకుండా జంతర్ మంతర్లోకి చొరబడినందుకు దాస్, రాంకాలను తిహార్ జైలుకు పంపారు. అయితే ఇందులో సీజేపీ మరో లీడర్ అజింక్య షిండే కూడా ఉండగా.. తర్వాత విడిచి పెట్టారు.
దీనిపై స్పందించిన అభిజీత్ దీప్కే.. మూడు రంగుల జెండాను పట్టుకుని శాంతి యుతంగా నిరసన చెప్పటమే వాళ్లు చేసిన తప్పా..? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
మీరు నిజంగా నిరసనలను, ప్రజాగ్రహాన్ని అణచివేయాలనుకుంటే మీ గట్స్ ఏంటో చూపండి.. అధికారికంగా ఎమర్జెన్సీ పక్రటించే ధైర్యం ఉంటే చేయండి.. కానీ ఇలాంటి పిరికి చర్యలతో ఒరిగేదేమీ ఉండదని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
