‘మా రాముడు అందరివాడు’ ఫేమ్ శ్రీరామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘రామభద్రుడు’. మహేష్ భాగ్యరాజ్ దర్శకుడు. దుర్గా వరప్రసాద్ నిర్మిస్తున్నారు. సుందర్ రాజ్ కో ప్రొడ్యూసర్. తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, గోల్డ్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
అనంతరం హీరో శ్రీరామ్ మాట్లాడుతూ ‘హీరోగా నేను నటిస్తున్న 13వ చిత్రమిది. ప్రేక్షకులు కోరుకునే అన్ని రకాల కమర్షియల్ అంశాలు కలగలిసిన కథతో రూపొందిస్తున్నాం. ప్రముఖ నటీనటులు, ప్రతిభ గల సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. వీలయినంత త్వరగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని చెప్పారు.
