మాస్ మహారాజా రవితేజ నుంచి వస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’. శుక్రవారం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో తండ్రి–కూతుళ్ల అనుబంధం కథకు ప్రధాన బలంగా నిలవనుండగా, చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో కనిపించనుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం ఆదివారం (ఆగస్టు 16) రాత్రి ‘మల్లెపూల పల్లకి’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది.
ఈ సాంగ్ రిలీజ్ వేడుకలో సినిమా టీమ్‌తో పాటు చిన్నారి నక్షత్ర కూడా ఉత్సాహంగా పాల్గొంది. అయితే ఈ ఈవెంట్‌లో సరదాగా సాగిన సంభాషణ కాస్తా ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. వేదికపై మైక్ అందుకున్న బేబీ నక్షత్ర రవితేజను కొన్ని క్యూట్ అండ్ ఫన్నీ ప్రశ్నలు అడిగింది. ఇందులో భాగంగానే ‘‘నాకు ముద్దు పేరు పెట్టాలంటే ఏం పెడతారు?’’ అని ప్రశ్నించింది.
దీనికి కాసేపు ఆలోచించిన రవితేజ సభలో అందరూ వింటుండగానే ఒక అసభ్యకరమైన, వివాదాస్పద బూతు పదాన్ని ఉపయోగిస్తూ ‘ముదురు ముం*’ అంటూ సమాధానం ఇచ్చారు. అక్కడున్న కొంతమంది దీనికి నవ్వులు చిందించగా, ఆ చిన్నారి ఆ పదానికి అర్థం ఏమిటని ప్రశ్నించింది. దానికి రవితేజ "తర్వాత చెబుతానులే" అంటూ దాటవేశారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Nakshatra: What nickname would you like to give me?#Raviteja: “Muduru Munda” pic.twitter.com/t1qV8AmkFj
— cinee worldd (@Cinee_Worldd) August 16, 2026
నెటిజన్ల ఫైర్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ఒక భక్తిరస నేపథ్యం ఉన్న చిత్రం, పైగా తండ్రి కూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న సినిమాలో నటించిన మైనర్ బాలికతో పబ్లిక్ ఈవెంట్‌లో రవితేజ ఇలా మాట్లాడటాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కనీస బాధ్యత, కామన్ సెన్స్ లేకుండా ఒక చిన్నారి అమ్మాయిని పబ్లిక్ స్టేజ్ మీద అలా అనడం ఏంటని మండిపడుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా రవితేజ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒక నెటిజన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘‘కనీస ఇంగితజ్ఞానం, బహిరంగ ప్రదేశాల్లో పాటించాల్సిన మర్యాద కూడా లేని ఒక స్టార్.. ఓ మైనర్ బాలికను “ముండ” అని సంబోధించడం అత్యంత విచారకరం. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆ ఘటనను చూసి కొందరు నవ్వుతూ వినోదంగా తీసుకోవడం. ఒక ప్రశ్న మాత్రం సహజంగానే తలెత్తుతుంది. తాను చేసినట్లే, ఎవరైనా బహిరంగంగా రవితేజ గారి సొంత కుమార్తెను అదే పదంతో పిలిస్తే ఆయన దాన్ని అంగీకరిస్తారా?.. స్టార్ హీరో హోదాలో ఉండి, పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లపై మాట్లాడేటప్పుడు ఎలాంటి భాష వాడాలో కనీస స్పృహ లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ లేదా రవితేజ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.
A star without even basic common sense or public etiquette, calling a minor “Munda” and people are laughing at this. Wow, where are we heading?
— India Flick (@IndiaFlick) August 16, 2026
Would #Raviteja be okay if someone casually called his daughter “Munda” in public just like he did ?
pic.twitter.com/4zyc1P75QX
