రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898 AD' సృష్టించిన రికార్డులు అందరికి తెలిసిందే.. భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ సీక్వెల్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో రహస్యంగా, వేగంగా సాగుతోంది. అగ్ర హీరోలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొన్న రెండు కీలక షెడ్యూల్స్ ఇప్పటికే పూర్తయ్యాయి..
ఆలియా భట్ ఎంట్రీతో సరికొత్త ట్విస్ట్..
సీక్వెల్‌లో ఒక భారీ సర్‌ప్రైజ్ ఉండబోతోందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందరూ ఊహించినట్లుగా ఆమె దీపికా పదుకొణె పోషించిన 'సుమతి' పాత్రలో కాదు. కథా గమనాన్ని మలుపు తిప్పే సరికొత్త పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆలియా కొన్ని సన్నివేశాల్లో నటించారని, మేకర్స్ ఈ విషయాన్ని ఎక్కడా బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం..
సాయిపల్లవి ఎంట్రీతో పాత్రలో మార్పు?
మరోవైపు.. ఈ సీక్వెల్‌లో 'సుమతి' పాత్రలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కనిపించబోతోంది. కల్కి మొదటి భాగంలో సుమతి పాత్రకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా.. రెండో భాగంలో ఆ పాత్రను సాయిపల్లవి ఏ రేంజ్‌లో పండిస్తుందోనని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో మరింత ఉత్కంఠను పెంచుతోంది.
భారీ అంచనాలతో..
ఈ మూవీని భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ సంస్థ ఎక్కడా రాజీ పడకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో విజువల్ వండర్ గా నిర్మిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ తనదైన మ్యూజిక్ ఐడెంటిటీతో సీక్వెల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. భారతీయ పురాణాలకు, భవిష్యత్ కాలపు సాంకేతికతకు జోడించి నాగ్ అశ్విన్ అల్లుతున్న ఈ మాయాజాలం కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో ఆలియా, సాయిపల్లవి వంటి క్రేజీ కాంబినేషన్లు తోడైతే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..
Interesting buzz from the world of #Kalki2898AD 👀🔥
— Media Mic | Indian Cinema | Tollywood (@MMTollywood) June 16, 2026
Reports suggest that #AliaBhatt is indeed a part of the sequel. However, she is reportedly not playing the much-discussed SUM-80 character, a role said to be portrayed by #SaiPallavi ❤️🔥
The buzz further indicates that Alia…
