ప్రాణాలు ముఖ్యమా? ఫోటోలు ముఖ్యమా?.. మీడియాపై సల్మాన్ ఖాన్ సీరియస్!

ప్రాణాలు ముఖ్యమా? ఫోటోలు ముఖ్యమా?..  మీడియాపై సల్మాన్ ఖాన్ సీరియస్!

బాలీవుడ్ స్టార్ హీరో  సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే, లేటెస్ట్ గా ఆయన ముంబైలోని హిందూజా హాస్పిటల్ వెలుపల కోపంతో ఊగిపోయారు.. హాస్పిటల్ గేటు వద్ద తనను ఫాలో అవుతూ, కెమెరాలతో చుట్టుముట్టిన మీడియా ఫోటోగ్రాఫర్స్ పై సల్లూ భాయ్ అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సల్మాన్ కారును గమనించిన ఫోటోగ్రాఫర్లు, ఆయనను వదలకుండా హాస్పిటల్ వరకు వెంబడించారు. ఆయన బయటకు రాగానే "భాయ్.. భాయ్" అంటూ గట్టిగా అరుస్తూ అటెన్షన్ కోరుకున్నారు. దాంతో సహనం కోల్పోయిన సల్మాన్.. ఇది హాస్పిటల్, ఇక్కడ గొడవ చేయకండి. కొంచెం కామన్  సెన్స్ ఉండాలి కదా.  మీ కుటుంబంలో ఎవరైనా హాస్పిటల్‌లో చేరితే ఇలాగే ప్రవర్తిస్తారా? అంటూ క్లాస్ పీకారు.

 

సల్మాన్ రుద్రరూపం..

హాస్పిటల్ ఘటన తర్వాత సల్మాన్ ఖాన్ వరుస ఇన్‌స్టాగ్రామ్ పోస్టులతో సోషల్ మీడియాను షేక్ చేశారు. తన సెల్ఫీలను షేర్ చేస్తూ.. మీడియా ప్రవర్తనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒకరి బాధను చూసి ఆనందించకండి. నేను ఎల్లప్పుడూ ప్రెస్‌కు మద్దతుగా నిలిచాను, వారితో మాట్లాడాను, వారి పొట్టకూటి కోసం ఆలోచించాను. కానీ, నా నష్టాలను, బాధలను అమ్ముకుని డబ్బు సంపాదించాలనుకుంటే మాత్రం ఊరుకోను. మనుషుల ప్రాణాల కంటే మీకు ఫోటోలే ముఖ్యమా? అంటూ సల్మాన్ ఘాటుగా ప్రశ్నించారు. 

 

నాకు 60 ఏళ్లు.. కానీ..

మరో పోస్ట్‌లో సల్మాన్ మరింత క్రేజీగా వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వాళ్లను వంద మందిని తగలబెడతా.. ఒక సోదరుడు బాధలో ఉన్నప్పుడు ఇలాంటి ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకండి. నాకు ఇప్పుడు 60 ఏళ్లు (60 Years Old), కానీ ఇంకా ఫైట్ చేయడం మర్చిపోలేదు. గుర్తుపెట్టుకోండి.. జైల్లో వేస్తారా? హా హా! అంటూ మాస్ డైలాగులతో రెచ్చిపోయారు. ఎమోషనల్ పరిస్థితులను క్యాష్ చేసుకోవద్దని హెచ్చరించారు.

 

వరుస సినిమాలతో..

ఒకవైపు ఈ వివాదం నడుస్తుండగానే.. సల్మాన్ ఖాన్ లైనప్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆయన త్వరలోనే అత్యంత ప్రతిష్టాత్మక వార్ డ్రామా ‘మాతృభూమి’ చిత్రంలో కనిపించనున్నారు. దీనితో పాటు, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ #SVC63 లో లేడీ సూపర్ స్టార్ నయనతారతో కలిసి సల్మాన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ సినిమాతో సౌత్ మార్కెట్‌ను కూడా సల్మాన్ షేక్ చేయడం ఖాయం అని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.