Tiger 3 Review : సల్మాన్‌ ఖాన్‌ టైగర్ 3 ట్విట్టర్ రివ్యూ..ఎలా ఉందంటే?

Tiger 3 Review :  సల్మాన్‌ ఖాన్‌ టైగర్ 3 ట్విట్టర్ రివ్యూ..ఎలా ఉందంటే?

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ( Salman Khan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్‌-3’(Tiger 3). గతంలో ఈ ప్రాంచైజీలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలు బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూడో భాగానికి మనీశ్ వర్మ(Maneesh Sharma) దర్శకత్వం వహించగా..యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. మొదటి రెండు చిత్రాల్లో హీరోయిన్‌‌‌‌గా నటించిన కత్రినా కైఫ్‌(, Katrina Kaif)‌‌‌..ఇందులోనూ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. 

టైగర్ 3 మూవీ ఇవాళ (నవంబర్12న) దీపావళి సందర్భంగా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో లుక్కేద్దాం. 

టైగర్‌-3 మూవీకి ఎక్స్‌(ట్విటర్‌) లో మిక్స్డ్ టాక్తో రన్ అవుతోంది. సల్మాన్ ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి, కొంత మంది సినీ ప్రియుల నుంచి యావరేజ్ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా టైగర్ 3 మూవీని రీసెంట్గా వచ్చిన షారుఖ్ పఠాన్‌, జవాన్ మూవీస్తో కంపైర్ చేస్తూ..అంతటి రేంజ్లో లేదంటూ కొంతమంది డిస్సపాయింట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. కానీ, యాక్షన్‌ ఎపిసోడ్ల విషయంలో మాత్రం తగ్గేదేలా లేదంటూ..సల్మాన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.

డైరెక్టర్ మనీష్‌ శర్మ తెరెక్కించిన విధానం బాగున్నప్పటికీ..కొన్ని సీన్స్ మాత్రం స్లో స్లో నేరేషన్లో ఉన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఈ మూవీ జేమ్స్‌ బాండ్‌, బౌర్న్‌ చిత్రాల తరహాలో ఎమోషన్స్‌తో సీన్స్తో పాటు..పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్ట్ మూవీగా తెరకెక్కించినట్లుగా ఉంది. రోరింగ్‌ బ్లాక్‌ బస్టర్‌ ఫీల్తో వీకెండ్ తో పాటు..ఫెస్టివల్ కూడా కలిసి రావడంతో భారీ కలెక్షన్స్‌తో  దూసుకెళ్లడం కన్ఫమ్ అంటూ ట్రేడ్ వర్గాల సమాచారం. 

స్పై థ్రిల్లర్‌ జోనర్ లో ఇది వరకు వచ్చిన మూవీస్ తో పోల్చుకుంటే..టైగర్ 3 వాటికి బాస్‌గా నిలుస్తుంది. ఈ మూవీ సల్మాన్‌కు మంచి కమ్‌ బ్యాక్‌ మూవీ. ఇమ్రాన్ హష్మీ విలనిజం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. హీరోయిన్ కత్రినా కైఫ్ అటూ గ్లామర్ లోను, యాక్షన్ సీక్వెన్స్‌తోను అదరగొట్టేసింది. మొత్తానికి సల్మాన్ టైగర్ 3 స్పై యాక్షన్ యూనివర్స్‌లో బెస్ట్ మూవీ అంటూ సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీలో సల్మాన్‌ ఖాన్‌ చాలా నీరసంగా కనిపించాడు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఊహించనంత రేంజ్ లో లేదంటూ ఓ వర్గం ఫ్యాన్స్ కాస్తా డిస్సపాయింట్ అవుతున్నారు. 

రా ఏజెంట్‌‌‌‌గా షారుఖ్ క్యారెక్టర్ సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాడు. షారుఖ్ ఖాన్ ఎంట్రీ.. టైగర్‌ను కాపాడే సీన్‌కు థియేటర్లో ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ రావాల్సిందే అని అంటున్నారు. టైగర్‌ కా బాప్ పఠాన్ అని, బాలీవుడ్ మొత్తం ఒక వైపు..షారుఖ్ క్రేజ్ ఇంకో వైపు అని ఫ్యాన్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు.మొత్తానికి ఆ సీన్‌ను అయితే జనాలు లీక్ చేశారు. షారుఖ్ కేమియో రోల్, టైగర్‌ను కాపాడే సీన్ లీక్ అవ్వడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

కబీర్ (హృతిక్ రోషన్) రోల్ నెక్స్ట్ లెవెల్లో అదిరిపోయింది..అని ఒకరు కామెంట్ చేశారు. సల్మాన్ ఖాన్ ఎంట్రీ సీన్, ఫైట్ సీన్ అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. దీనికి సంబంధించిన ఫైట్ సీన్ విజువల్స్ కూడా నెటిజన్స్ షేర్ చేస్తున్నారు.