సల్మాన్..కత్రినా థియేటర్లో డ్యాన్స్.. వీడియో వైరల్

 సల్మాన్..కత్రినా థియేటర్లో డ్యాన్స్.. వీడియో వైరల్

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ( Salman Khan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్‌-3’(Tiger 3). గతంలో ఈ ప్రాంచైజీలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలు బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లో మిక్స్డ్ టాక్తో రన్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా బాగా డిస్సపాయింట్లో ఉన్నారు. దీంతో సల్మాన్..కత్రినా ఫ్యాన్స్లో హుషారు పెంచుటకు ముంబైలోని ఓ థియేటర్కు వెళ్లి  డ్యాన్స్ చేస్తూ సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కత్రినా పసుపు రంగు ప్రింటెడ్ డ్రెస్‌లో అందంగా కనిపించగా, సల్మాన్ టీ-షర్ట్ మరియు జీన్స్లో నార్మల్గా కనిపించాడు.

టైగర్ 3 బిజినెస్ లెక్కలు చూసుకుంటే..భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ..థియేట్రికల్ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ పలికింది. దాదాపు రూ. 300 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 9000లకు పైగా థియేటర్లలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. 

ఇండియా మొత్తంలోటైగెర్ 3 మూవీ రూ. 239 కోట్లు గ్రాస్ వసూలు అయింది.రిలీజైన ఈ 6 రోజుల్లో ఓవర్సీస్‌లో 8.8 మిలియన్ డాలర్లను (73 కోట్లు) వసూలు చేసింది. వీటితో కలిపితే రూ. 312 కోట్లు గ్రాస్ వచ్చింది.

దాదాపు ఈ సినిమా రూ.300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు.అయితే  రూ.300 కోట్ల నెట్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 6 రోజుల్లో రూ. 200 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ.100 కోట్లు నెట్‌ వసూళ్లను రాబడితేనే హిట్ అవుతుంది. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు ఇదే దూకుడు పెంచితే తప్ప..బ్రేక్ ఈవెన్ చేరి.. సక్సెస్ ట్రాక్లోకి రావడం కష్టం అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ మూవీని మనీష్ శర్మ డైరెక్ట్ చేయగా..యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

  • Beta
Beta feature