డిసెంబర్‌లో సమంత డెలివరీ?.. పుట్టబోయే బిడ్డ పేరు కోసం ఫ్యాన్స్ సాయం కోరిన స్టార్ హీరోయిన్!

డిసెంబర్‌లో సమంత డెలివరీ?.. పుట్టబోయే బిడ్డ పేరు కోసం ఫ్యాన్స్ సాయం కోరిన స్టార్ హీరోయిన్!

టాలీవుడ్ సూపర్ స్టార్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలో అత్యంత అందమైన, మరుపురాని కొత్త అధ్యాయాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు, భర్త రాజ్ నిడిమోరుతో కలిసి తమ తొలి సంతానానికి స్వాగతం పలికేందుకు సమంత ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ విరామంలో ఉన్న ఈ భామ, సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ తన మాతృత్వపు అనుభూతులను పంచుకుంటున్నారు.

వెయిట్ గెయిన్..

లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నిర్వహించిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' (AMA) సెషన్‌లో సమంత తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి అత్యంత రసవత్తరమైన, సరదా విషయాలను బయటపెట్టారు. అభిమానులు అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆమె తనదైన శైలిలో బదులిచ్చారు. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరుగుతున్నానంటూ ఓ అభిమాని ఆందోళన వ్యక్తం చేశారు. అవును 'నేను కూడా నీ లాగే ఫీలవుతున్నా.. ఇప్పటివరకు ఏకంగా 11 కిలోల బరువు పెరిగాను' అని ఓపెన్‌గా చెప్పారు సమంత.

పుట్టబోయే బిడ్డకు పేరు..

బిడ్డ కోసం చేసిన షాపింగ్ తనకు ఎంతో గందరగోళంగా, భయంగా అనిపిస్తోందని సరదాగా సమంత వ్యాఖ్యానించారు. మరో అభిమాని పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ.. పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెట్టాలో నిర్ణయించడం ఊహించిన దానికంటే చాలా కష్టంగా ఉందంటూ.. ఫ్యాన్స్ సహాయం కోరారు.

స్కాన్స్ భయం..

మెడికల్ స్కాన్స్ ఫలితాల కోసం వేచి చూసేటప్పుడు కాస్త భయంగా ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది. కానీ ఈ మొత్తం ప్రెగ్నెన్సీ ప్రాసెస్ తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, ఒక రకమైన శక్తిని నింపిందని వెల్లడించారు. జీవితంలో కొత్త మార్పులకు సిద్ధపడటం ఎప్పుడూ ఒక గొప్ప అనుభవం .  ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్ వంటి విషయాలపై కొత్తగా తల్లులు కాబోతున్న వారికి ధైర్యాన్నిచ్చేలా సమంత మాట్లాడిన మాటలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఫిట్‌నెస్ ఫొటోలు వైరల్..

ఇటీవలే భర్త రాజ్ నిడిమోరుతో కలిసి బేబీమూన్ వెళ్లిన పొటోలు, ఫిట్‌నెస్ వర్కౌట్స్ వీడియోలను కూడా షేర్ చేయగా అవి నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం వంద కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నటనకు తాత్కాలిక విరామం ఇచ్చిన సమంత, డిసెంబర్‌లో తమ బేబీకి జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ నెటిజన్లు సమంతకు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు.