Technology: మెటా ఏఐ యాప్ వచ్చేసిందోచ్.. ఎలాంటి ప్రశ్నలకైనా సింపుల్గా ఆన్సర్ ఇచ్చేస్తుందట !

Technology: మెటా ఏఐ యాప్ వచ్చేసిందోచ్.. ఎలాంటి ప్రశ్నలకైనా సింపుల్గా ఆన్సర్ ఇచ్చేస్తుందట !

లామా 4 లాంగ్వేజ్ మోడల్​తో డెవలప్​ అయినదే ఈ మెటా ఏఐ యాప్. ఇప్పటికే స్మార్ట్​ ఫోన్​ యూజర్లు ఆయా యాప్​లలో ఏఐ ఫీచర్లను వాడుతున్నారు. అయితే కేవలం ఏఐ సేవలు మాత్రమే పొందగలిగేలా కొత్త యాప్​ తీసుకొచ్చింది మెటా కంపెనీ. ఆ యాప్​ పేరు మెటా. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ వాడి మాట్లాడడం చాలా ఈజీ. ఎలాంటి ప్రశ్నలకైనా సింపుల్​గా ఆన్సర్​ ఇచ్చేస్తుందట.

ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్​ యూజర్లకు అందుబాటులో ఉంది. దీని వల్ల లాభాలేంటంటే.. మొదటిగా వాయిస్ చాట్ మోడ్​లో వాడుకోవచ్చు.  చేతులు ఉపయోగించకుండా నేచురల్​గా మాట్లాడేయొచ్చు. అంతేకాదు.. ఇమేజ్ క్రియేషన్, ఎడిటింగ్ కూడా వాయిస్​తోనే చేయొచ్చు. తర్వాత మల్టీ టాస్కింగ్​.. ఏఐ వాయిస్​ ఫీచర్ సాయంతో చాట్​బాట్​తో మాట్లాడుతూనే డివైజ్​లో ఇతర యాప్​లు కూడా వాడొచ్చు. అలాగే మైక్రోఫోన్​ ఆన్​లో ఉందని తెలిపేలా స్క్రీన్​పై ఒక ఐకాన్​ ఉంటుంది.

ఇందులో మరో ఫీచర్ డిస్కవర్ ఫీడ్. దీని ద్వారా ఏఐ ప్రాంప్ట్​లు, ఇమేజ్​లు, చాట్​బాట్​ రిప్లయ్​లను షేర్ చేయొచ్చు. ఇతరులు వాటిని చూసి లైక్, కామెంట్​ లేదా రీమిక్స్ చేయొచ్చు. అంతేకాదు.. ఈ యాప్​ రే బాన్​ స్మార్ట్ గ్లాసెస్​తో కూడా లింక్​ అవుతుంది. గ్లాసెస్​లో స్టార్ట్ చేసిన సంభాషణలను యాప్​ లేదా వెబ్​సైట్​లో కంటిన్యూ చేయొచ్చు. ఇంకా ఇమేజ్ ఎడిటింగ్, గ్యాలరీ యాక్సెస్ వంటివి కూడా ఉన్నాయి.