
బిగ్ బాస్’ ఫేమ్ గౌతమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సోలో బాయ్’. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో గౌతమ్, రమ్య కాలేజ్ స్టూడెంట్స్‌గా కనిపిస్తూ ఆకట్టుకున్నారు.
యూత్‌ఫుల్ కథతో, రొమాంటిక్ వైబ్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌తో ఈ సినిమా ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేస్తుందనే నమ్మకం ఉందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. జుడా సంధ్య సంగీతం అందిస్తున్నాడు.