ఇది రాముడి యుగారంభం’.. ‘రామాయణ’ నుంచి స్పెషల్ పోస్టర్

ఇది రాముడి యుగారంభం’.. ‘రామాయణ’ నుంచి స్పెషల్ పోస్టర్

రణ్‌‌‌‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘రామాయణ’.  నితేష్ తివారీ  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని    ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సమర్పణలో, డి‌‌‌‌నెగ్, మాన్‌‌‌‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో  నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మిస్తున్నారు.   నవరాత్రుల సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇందులో  రణ్‌‌‌‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా,  యష్ రావణుడిగా కనిపిస్తున్న   పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ‘యే రామ్ కే యుగ్ కా ఆరంభ్ హై’ అంటూ క్యాప్షన్ ఇవ్వడం ఆసక్తిని పెంచుతోంది.  ఈ చిత్రంలో  సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించ నున్నాడు.   రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ  ఫస్ట్ పార్ట్‌‌‌‌ దీపావళి సందర్భంగా నవంబర్ 5న పాన్‌‌‌‌ ఇండియా వైడ్‌‌‌‌గా రిలీజ్‌‌‌‌ కానుంది.  ఈ దసరా నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయని మేకర్స్ తెలియజేశారు.  హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు  ఐమాక్స్  ఫార్మాట్‌‌‌‌లోనూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది.