Sri Vishnu సెన్సేషన్: రిలీజ్‌కు ముందే లాభాల్లో ‘విష్ణు విన్యాసం’.. రూ.19 కోట్ల బడ్జెట్.. రూ.26 కోట్ల బిజినెస్.!

Sri Vishnu సెన్సేషన్: రిలీజ్‌కు ముందే లాభాల్లో ‘విష్ణు విన్యాసం’.. రూ.19 కోట్ల బడ్జెట్.. రూ.26 కోట్ల బిజినెస్.!

శ్రీవిష్ణు హీరోగా యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో సుమంత్ నాయుడు జి నిర్మించిన చిత్రం ‘విష్ణు విన్యాసం’. ఇవాళ (2026 Feb27) థియటర్లోకి వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే, సినిమా విడుదలకు ముందుగా శ్రీ విష్ణు పంచుకున్న విశేషాలు, సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, లాభాల గురించి తెలుసుకుందాం. 

‘‘ఇందులో నేను నెంబర్లను, జాతకాలను అతిగా నమ్మే ఒక లెక్చరర్‌‌‌‌గా నటించాను. ఆ నమ్మకాలతో నా క్యారెక్టర్ చేసే విచిత్ర విన్యాసాలు ప్రేక్షకులను కడుపుబ్బా  నవ్విస్తాయి. ముఖ్యంగా 'వీరి వీరి గుమ్మడి పండు' అనే సీక్వెన్స్‌‌తో పాటు  ఇంటర్వెల్ బ్యాంగ్‌‌ను ఆడియెన్స్‌‌ బాగా ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్‌‌గా నయన్ సారిక పాత్ర ఇందులో చాలా కీలకం. తన డామినేషన్ వల్ల నా పాత్ర పడే ఇబ్బందుల నుంచే ఎక్కువ ఎంటర్‌‌టైన్‌మెంట్ వస్తుంది. రెండు, మూడు పేజీల డైలాగులను కూడా ఆమె సింగిల్ టేక్‌‌లో అద్భుతంగా చెప్పింది. తన నటన సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణ.

అలాగే దర్శకుడు మారుతి ఎంతో క్లారిటీగా ఎడిటింగ్ మీద గ్రిప్‌‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు గంటల పాటు ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా నవ్వుకోవాలనుకునే వారికి ఈ  సినిమా సరైన ఛాయిస్. సినిమా విడుదల కాకముందే ఓటీటీ డీల్స్ క్లోజ్ అవ్వడం వల్ల నిర్మాతలు సేఫ్ జోన్‌‌లో ఉన్నారు. నా తదుపరి మూడు సినిమాల బిజినెస్ కూడా ఇప్పుడే పూర్తవ్వడం సంతోషంగా ఉంది.

ఇక ఓ నటుడిగా కామెడీ పండించడం కష్టమే కానీ కథలో కామెడీ ఉండి, అందుకు తగ్గ సిచ్యువేషన్ సీన్స్‌‌ ఉంటే ప్రేక్షకులకు ఆ చిత్రం త్వరగా కనెక్ట్ అవుతుంది. ఇక నేను నటిస్తున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఎనభై శాతం పూర్తయింది.  రామ్ అబ్బరాజుతో ఓ సినిమా మొదలవబోతోంది. అలాగే సితార బ్యానర్‌‌‌‌లో సన్నీ అనే ఒక కొత్త దర్శకుడుతో ఓ సినిమా చేస్తున్నా” అని విష్ణు తెలిపారు.

విడుదలకు ముందే ప్రాఫిట్!

ప్రస్తుత రోజుల్లో సినిమాను నిర్మించడం ఒక ఎత్తు అయితే, దానిని లాభాల్లోకి తీసుకురావడం మరో ఎత్తు. చాలా మంది నిర్మాతలు థియేటర్ రన్ మీదనే ఆశలు పెట్టుకుంటారు. కానీ 'విష్ణు విన్యాసం' విషయంలో మేకర్స్ చాలా సేఫ్ జోన్ లో ఉన్నారు.

ఈ చిత్రాన్ని సుమారు రూ.19 కోట్ల వ్యయంతో నిర్మించారు. హీరో శ్రీవిష్ణుకు ఉన్న క్రేజ్ కారణంగా, ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు కలిపి ఏకంగా రూ. 26 కోట్లకు అమ్ముడయ్యాయని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా థియేటర్లోకి అడుగుపెట్టక ముందే నిర్మాతలకు రూ. 7 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది.

ఇవాళ షోస్ కంప్లీట్ అయ్యేలోపు పాజిటివ్ టాక్ ఊపందుకుంటే వసూళ్ల మోత మోగిపోవాల్సిందే. ఇక వచ్చే వసూళ్లన్నీ అదనపు లాభాలే అని మేకర్స్ లెక్కలు వేస్తున్నారని సినీ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

ది కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్

శ్రీవిష్ణు గత చిత్రాలైన 'సామజవరగమన', 'ఓం భీమ్ బుష్' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంలో ఆయన దిట్ట. అందుకే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆయన సినిమా అంటే వెనుకాడకుండా పెట్టుబడి పెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. 'విష్ణు విన్యాసం' టీజర్, పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండటం, సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది. ఇక ఇది కూడా హిట్ అయితే, స్థార్ హీరోల లిస్టులో శ్రీ విష్ణు చేరడం కన్ఫార్మ్!