ముంబై: ఐపీఎల్ ట్రేడింగ్ విండోలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లను మార్పిడి చేసుకున్నాయి. లెఫ్టార్మ్ పేసర్ టి. నటరాజన్ తిరిగి సన్‌రైజర్స్ గూటికి చేరగా, లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ క్యాపిటల్స్ జట్టులోకి మారాడు. నటరాజన్‌కు ఎస్ఆర్హెచ్ రూ. 5 కోట్లు చెల్లించనుంది. 2025 ఐపీఎల్ వేలంలో నటరాజన్‌ను క్యాపిటల్స్ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.
2020 నుంచి 2024 వరకు ఐదు సీజన్ల పాటు ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహించిన నటరాజన్.. లీగ్‌లో అత్యుత్తమ లెఫ్టార్మ్ పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2024 సీజన్లో 19 వికెట్లు పడగొట్టి జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో 73 మ్యాచ్‌లు ఆడిన 35 ఏళ్ల నటరాజన్ మొత్తం 72 వికెట్లు తీశాడు. మరోవైపు 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్ తరఫున 10 మ్యాచ్‌లు ఆడిన జీషన్ అన్సారీ రూ.40 లక్షలకే ఢిల్లీకి మారాడు.
