రంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు.. మహిళలకు మంచి ఛాన్స్.. మిస్సవకండి..!

 రంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు.. మహిళలకు మంచి ఛాన్స్.. మిస్సవకండి..!

తెలంగాణ ప్రభుత్వం, మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో అంగన్‌‌‌‌వాడీ టీచర్ (ఏడబ్ల్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా పరిధిలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న మొత్తం 125 అంగన్‌‌‌‌వాడీ టీచర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సంబంధిత ప్రాజెక్ట్ పరిధిలో స్థానికంగా నివసించే అర్హులైన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

మొత్తం పోస్టులు: 125. (అన్​రిజర్వ్డ్ 30, ఎస్టీ 32, ఎస్సీ 11, బీసీ–ఎ 7, బీసీ–బి 8, బీసీ–సి 5, బీసీ–డి 5, బీసీ–ఈ 4, ఈడబ్ల్యూఎస్ 13, ఎక్స్ సర్వీస్​మెన్ 6, వీహెచ్ 2, హెచ్​హెచ్ 2). 

ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా: అమన్​గల్ 31, చేవెళ్ల 29, హయత్​నగర్ 3, ఇబ్రహీంపట్నం 21, మహేశ్వరం10, శేరిలింగంపల్లి 5, షాద్‌‌‌‌నగర్ 26.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్టమైన ప్రాంతం లేదా పోస్టుకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో పదోతరగతి పాసైన అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయసు: 2026, జులై 1 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 31.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 10. 

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ wdcw.tg.nic.inను సందర్శించండి.