శ్రీదేవి..జాన్వీ మధ్య రెమ్యూనరేషన్ తేడా ఎంతంటే?

 శ్రీదేవి..జాన్వీ మధ్య రెమ్యూనరేషన్ తేడా ఎంతంటే?

బాలీవుడు ముద్గుగుమ్మ జాన్వీ కపూర్( Janhvi Kapoor) పల్లెటూరి పడుచుల కనిపించబోతుంది. ఎన్టీఆర్ తో జోడిగా నటిస్తున్న దేవర సినిమాలో ఫిషర్ మాన్ కూతురిలా నటించబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..జాన్వీ రెమ్యునరేషన్ తీసుకోవడంలో తగ్గేదేలే అన్నట్టుగా దూసుకెళ్తోంది. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా కోసం దాదాపుగా ఆమె రూ.3.5 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే జాన్వీ కపూర్ నటించిన ఫస్ట్ ఫిల్మ్ ధడక్ కోసం 60 లక్షల రూపాయలు అందుకుంది. జాన్వీ తన తొలి తెలుగు సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ ను..శ్రేదేవి తీసుకున్న రెమ్యునరేషన్ తో పోలికలు అధికం అంటూ సోషల్ మీడియాలో చర్చలు వస్తున్నాయి. కానీ, అప్పట్లో శ్రేదేవి తీసుకున్న దానికి..ఇప్పటి కాలానికి పోలిక అధికం అయినప్పటికీ..అప్పటి కాలంతో ప్రస్తుతాన్ని పోల్చడం సరికాదు. 

ఇదిలా ఉంచితే..అప్పట్లో అతిలోక సుందరి శ్రీదేవి..భాషతో సంబంధం లేకుండా సినిమాలలో నటించి ఆడియాన్స్ ను సొంతం చేసుకోంది. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు శ్రీదేవి అంటే ఎవర్ గ్రీన్ హీరోయిన్ అంటే నమ్మలేరు సుమా! శ్రీదేవి అప్పట్లోనే స్టార్ట్ హీరోలకు ధీటుగా రెమ్యునరేషన్ అందుకుంటూ తన ఫామ్ ను కొనసాగించింది. చిరంజీవితో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కోసం  శ్రీదేవి ఏకంగా రూ. 25 లక్షలు తీసుకుంది.ఈ సినిమా అప్పట్లో రూ.15 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాపీస్ హిట్ సాధించింది. ఈ సినిమా కోసం చిరు రూ. 35 లక్షలు అందుకున్నారు.