‘‘ది ఫ్యామిలీ మేన్ రిటర్న్స్’’.. అతి త్వరలో అమెజాన్ ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వీడియోలో సీజన్ 3 స్ట్రీమింగ్

‘‘ది ఫ్యామిలీ మేన్ రిటర్న్స్’’.. అతి త్వరలో అమెజాన్ ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వీడియోలో సీజన్ 3  స్ట్రీమింగ్

ఇండియన్ వెబ్ సిరీసుల్లో అత్యంత ఆదరణ పొందిన వాటిల్లో ‘ది ఫ్యామిలీ మేన్’ సిరీస్ ఒకటి. ఇప్పటికే రెండు సీజన్స్ రాగా, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం థర్డ్ సిరీస్ గురించి క్రేజీ అప్‌‌‌‌‌‌‌‌డేట్ అందించారు మేకర్స్. ‘ది ఫ్యామిలీ మేన్ రిటర్న్స్’ అంటూ  అతి త్వరలోనే  అమెజాన్ ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వీడియోలో సీజన్ 3  స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.

మనోజ్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్ లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో  రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ను రూపొందించారు. ఇందులో గూఢచారి పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీకాంత్ తివారీగా మనోజ్ కనిపించనున్నాడు. ప్రియమణి, షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, ఆశ్లేష ఠాకూర్, వేదాంత్ సిన్హా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీజన్‌‌‌‌‌‌‌‌ 1లో మేజర్ విక్రమ్‌‌‌‌‌‌‌‌గా కీలకపాత్ర పోషించిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. ఇందులోనూ కీరోల్‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతున్నాడు. రాజ్ అండ్ డీకేలతో పాటు ఈ మూడో సీజన్ రైటింగ్‌‌‌‌‌‌‌‌లో  సుమన్ కుమార్ భాగమయ్యాడు.