మీ ఇంటి చుట్టు ఈ 6 మొక్కలు ఉంటే.. పాములు అస్సలు రావు!

మీ ఇంటి చుట్టు ఈ 6 మొక్కలు ఉంటే.. పాములు అస్సలు రావు!

ఎండాకాలంలో ఎండలు, వర్షాకాలంలో ఉండే తేమ వల్ల మన ఇళ్ల చుట్టుపక్కల పాములు, కప్పలు, పురుగులు, తొండలు తిరగడటం ఎక్కువవుతుంటాయి. అందుకే చాలా మంది తోటలు, బాల్కనీలు, ఇంటి గేట్ల దగ్గరికి ఇవి రాకుండా ఉండటానికి కొన్ని మొక్కలు నాటుతుంటారు. ఏ మొక్క కూడా నూటికి నూరు శాతం రక్షణ ఇస్తుందని చెప్పలేం కానీ, కొన్ని రకాల మొక్కల నుంచి వచ్చే ఘాటైన వాసనలు పాములు, కీటకాలు  ఆ ప్రదేశానికి రాకుండా అడ్డుకుంటాయి. భారతీయ ఇళ్లలో ఈ ప్రయోజనం కోసం పెంచే 6 ముఖ్యమైన   మొక్కలు ఏంటంటే...........

1.  లెమన్ గ్రాస్
ఇంటి చుట్టుపక్కల పాములు, కీటకాలు రాకుండా ఉండడానికి లెమన్ గ్రాస్ ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని నుంచి వచ్చే ఘాటైన నిమ్మకాయ వాసన పాములకు అస్సలు నచ్చదు. పైగా ఈ మొక్క పొదలాగా దట్టంగా పెరుగుతుంది కాబట్టి, గోడల పక్కన లేదా నడిచే దారుల్లో ఇవి పెరిగితే పాములు కదలడం కష్టమవుతుంది. మన దేశంలోని ఎండలకు ఇది బాగా పెరుగుతుంది. ఒక్కసారి నాటితే దీనికి ఎక్కువ  నిర్వహణ అవసరం లేదు.

2. బంతి పువ్వు చెట్లు 
బంతి పువ్వులు నుంచి వచ్చే ఘాటైన వాసన వల్ల తోటల్లోని తెగుళ్లు, పురుగులు దూరంగా పారిపోతాయి. పాములు సాధారణంగా చిన్న కీటకాలను తినడానికి వస్తాయి కాబట్టి, బంతి మొక్కల వల్ల కీటకాలు తగ్గి.. ఒక విధంగా పాములు రావడం తగ్గుతుంది.

3. వెల్లుల్లి మొక్క 
వెల్లుల్లి మొక్కల నుంచి 'సల్ఫర్' లాంటి ఒక రకమైన ఘాటైన వాసన వస్తుంది. ఈ వాసనకు పాములు, కీటకాలు దూరంగా ఉంటాయని నమ్ముతారు. అందుకే చాలా మంది ఇంటి మెయిన్ గేట్ల దగ్గర, తోటల చివర్లో లేదా కాస్త తడిగా ఉండే మూలల్లో వెల్లుల్లి మొక్కలను నాటుతుంటారు.

4. స్నేక్ ప్లాంట్
పేరుకు 'స్నేక్ ప్లాంట్' అయిన..  ఇది పాములను దూరంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. దీని ఆకులు చాలా గట్టిగా, నిటారుగా, పదునైన అంచులతో ఉంటాయి. ఇంటి ప్రవేశ ద్వారాల దగ్గర, మూలల్లో ఈ మొక్కలను దట్టంగా పెంచితే, ఆ గరుకైన ఆకుల మధ్య చిన్న చిన్న పాములు,తొండలు దాక్కోవడానికి ఇష్టపడవు.

5. తులసి మొక్క 
భారతీయుల ఇళ్లలో తులసి మొక్కకు ఆధ్యాత్మిక, ఔషధ ప్రాధాన్యత ఉంది. తులసి ఆకుల నుంచి వచ్చే ఘాటైన మూలికా సువాసన దోమలు, ఈగలు, ఇతర కీటకాలను రానివ్వదు. కీటకాలు లేని చోట విషపురుగులు  ఉండవు కాబట్టి, కిటికీల దగ్గర, బాల్కనీల్లో తులసి మొక్కలు ఉంటే కీటకాలు రావడం తగ్గుతుంది.

6. ఉల్లి మొక్క 
వెల్లుల్లిలాగే ఉల్లి మొక్కలకు కూడా ఒక రకమైన ఘాటైన వాసన ఉంటుంది. ఈ వాసన పాములకు చికాకు కలిగిస్తుంది. తోటల సరిహద్దుల్లో, మురుగు కాలువల పక్కన లేదా తడి ఎక్కువగా ఉండే ప్రదేశాల దగ్గర ఉల్లి మొక్కలను నాటడం వల్ల పాములు, తొండలు అటువైపు రాకుండా చూసుకోవచ్చు.