TSRTC: బంపర్ ఆఫర్.. స్లీపర్ బస్సుల్లో 10 శాతం డిస్కౌంట్

TSRTC: బంపర్ ఆఫర్.. స్లీపర్ బస్సుల్లో  10 శాతం డిస్కౌంట్

సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్.  ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ  స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ పీటర్ బస్సుల్లో బెర్త్ పై 10 శాతం డిస్కౌంట్  కల్పించాలని  TSRTC యాజమాన్యం నిర్ణయించింది. సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్ పై 10 శాతం డిస్కౌంట్ ను   కల్పించింది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ, స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ఏప్రిల్ 30 వరకు డిస్కౌంట్ అమల్లో ఉంటుంది.

లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్ నుంచి చెన్నై. తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు రూట్లలో నడుస్తుండగా.. ఆహరి ఏసీ స్లీపర్ కమ్ పీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ కు, గోదావరిఖని -బెంగళూరు, కరీంనగర్-బెంగళూరు, నిజామాబాద్ తిరుపతి, నిజామాబాద్ బెంగళూరు, వరంగల్- బెంగళూరు రూట్లలో తిరుగుతున్నాయి. ఈ రూట్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుతోంది.