కుల వివక్ష నేపథ్యంలో ‘కాస్ట్’.. ఆసక్తి రేపుతున్న టీజర్

కుల వివక్ష నేపథ్యంలో ‘కాస్ట్’.. ఆసక్తి రేపుతున్న టీజర్

వరుణ్ సందేశ్,  గగన్ బాబు, సత్యం రాజేశ్, నాగబాబు  రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సోషల్ డ్రామా  ‘కాస్ట్’.  ఏకే జంపన్న దర్శకత్వంలో తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. కాశిక కపూర్, దివి వద్యా హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటించారు.  ఆదివారం టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  కుల వివక్ష నేపథ్యంలో రూపొందిన  సినిమా టీజర్ ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగింది.

సామాజిక సందేశంతో పాటు యాక్షన్, థ్రిల్లర్ అంశాలు, అనూప్ రూబెన్స్ సంగీతం ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ  ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ టీజర్ చాలా ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌గా ఉందని, సినిమా సూపర్  హిట్ కావాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న  నిర్మాత నవీన్ యెర్నేని, దర్శకుడు శివ నిర్వాణ కూడా సినిమా పెద్ద విజయం  సాధించాలని కోరుతూ టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ అందించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కులమతాలకు అతీతంగా రూపొందిందని ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉంటుందని మూవీ టీమ్ తెలియజేసింది.