Vastu tips: ఇంట్లో మత్స్యయంత్రం ఉంటే వాస్తుదోషాలు ఉండవా..

Vastu tips:  ఇంట్లో మత్స్యయంత్రం ఉంటే వాస్తుదోషాలు ఉండవా..

చాలామంది పూర్వీకులు కట్టిన ఇండ్లలో ఉంటారు.  అవి పురాతన కట్టడాలకు ఆనుకొని ఉంటాయి.  అవి చాలా వరకు వాస్తు ప్రకారం ఉండవు.. వాటిని మార్చాలన్నా మార్చలేం.. వాస్తు దోషాలు తొలగిపోవాలంటే మత్స్యయంత్రం ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుందా.. వాస్తు కన్సల్టెంట్​ కాశీనాధుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం. . .

ప్రశ్న: మా ఇంటికి పడమరవైపున ఇంటి గోడ గడీగోడ అనుకుని ఉన్నాయి.మాది తూర్పువాకిలి ఇల్లు.... ఉత్తరం, దక్షిణం వైపున ఇళ్లు ఉన్నాయి. పురాతనమైన కట్టడాలకు ఆనుకుని ఉన్న ఇళ్లకు దోషాలు ఉంటాయని ఒక పుస్తకంలో చదివాను. నిజమేనా? దోషాలు పోవాలంటే ఏం చేయాలి?

జవాబు:పురాతనమైన కట్టడాలకు పక్కన ఉండే ఇళ్లకు దోషాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని వాస్తు ప్రకారం కట్టి ఉండకపోవచ్చు లేదా ఎక్కువ సంవత్సరాలు గడవడం వల్ల దోషాలు పట్టొచ్చు. ఆ ప్రభావం పక్క ఇళ్ల మీద పడుతుంది. మీకు దగ్గర్లో ఉన్న సిద్ధాంతిని పిలిపించి చూపించుకోండి. పూజారులు లేదా పండితులను పిలిచి ఇంటికి మత్స్యయంత్రం కట్టించండి. గడీ వల్ల మీ ఇంటికి వచ్చే దోషాలు పోతాయి.


ప్రశ్న: మాది దక్షిణం వాకిలి ఇల్లు, తలుపు తీయగానే కిచెన్ కనిపిస్తుంది. హాలు తర్వాత కిచెన్ ఉంటాయి. కిచెన్​ ను ఆనుకుని తూర్పువైపు బెడ్రూం.. దాని పక్కనే కామన్ బాత్రూం. ఎవరు చూసినా.. కిచెన్ వాస్తు ప్రకారం లేదు.. మార్చమంటున్నారు. ఇంటి ముందు నీళ్ల సంపు ఉంది. వాస్తు ప్రకారం ఎలాంటి మార్పులు చేసుకోమంటారు?

జవాబు:మీ ఇంట్లో, కిచెన్ వాస్తు ప్రకారం లేదు. దక్షిణంలో నీళ్ల సంపు ఉండడం మంచిది కాదు. ఆర్ధిక ఇబ్బందులు వస్తుంటాయి. కిచెన్ దక్షిణ ఆగ్నేయంలో తూర్పు ముఖంగా ఉండాలి. వంటవండే మనిషి తూర్పుముఖం పెట్టి వంట చేయాలి. కామన్ బాత్రూం ఇంటికి ఈశాన్యంలో ఉండకూడదు. దాన్ని వాయువ్యంవైపు మార్చుకోవాలి. సంపు తూర్పు ఈశాన్యంలో ఉంటే మంచిది.