January 12 Vidudala: ఊటీ అందాల మధ్య రొమాంటిక్ షెడ్యూల్.. హీరో హీరోయిన్లతో భలే ప్లాన్ చేశాడు అనిల్ రావిపూడి

January 12 Vidudala: ఊటీ అందాల మధ్య రొమాంటిక్ షెడ్యూల్.. హీరో హీరోయిన్లతో భలే ప్లాన్ చేశాడు అనిల్ రావిపూడి

వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న క్రేజీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ ‘జనవరి 12 విడుదల’.   కీర్తి సురేష్‌‌‌‌‌‌‌‌,  కృతి శెట్టి హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పణలో  సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ఊటీలో ప్రారంభించారు. అక్కడి  ప్రకృతి అందాల నడుమ ఈ షెడ్యూల్ జరగనుంది.

ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో రెండు  పాటలతో పాటు కథలో కీలకమైన పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సీన్స్ సినిమాకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. హీరో హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌తోపాటు అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే సహా ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటున్నారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌తో  తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి.

జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌‌‌‌‌‌‌‌గా, ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.