స్లమ్ డాగ్.. రిలీజ్కు రెడీ

స్లమ్ డాగ్.. రిలీజ్కు రెడీ

విజయ్ సేతుపతి లీడ్ రోల్‌‌‌‌లో పూరి జగన్నాథ్‌‌‌‌  రూపొందిస్తున్న  చిత్రం ‘స్లమ్ డాగ్’. 33 టెంపుల్ రోడ్ అనేది క్యాప్షన్.  సంయుక్త హీరోయిన్‌‌‌‌గా నటిస్తుండగా, టబు, దునియా విజయ్, జరీనా వహాబ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  శనివారంతో ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.   

హైదరాబాద్‌‌‌‌లో జరిగిన చివరి షెడ్యూల్‌‌‌‌తో చిత్రీకరణ ముగిసినట్లు మేకర్స్ తెలియజేశారు.   పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు  హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.   ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాత్రల పరిచయ వీడియోలతో సినిమాపై ఆసక్తి పెరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్ర రిలీజ్ డేట్‌‌‌‌ను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.