
వాట్సాప్ చాటింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ని మరింత మెరుగుపరిచింది. సాధారణంగా గ్రూపుల్లో పెట్టే మెసేజ్‌లు పొడవుగా ఉంటాయి. సమాచారం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని టైప్ చేయడానికి కొంత టైం తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్ చాట్‌లో ఎంత పెద్ద మెసేజ్ అయినా వాయిస్ చాట్ టూల్‌తో పంపొచ్చు. ఇతరులకు షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ని వాయిస్‌లో మాట్లాడేస్తే.. అది ఆటోమెటిక్‌గా టెక్స్ట్ రూపంలో వచ్చేస్తుంది. దీంతో తక్కువ టైంలోనే గ్రూప్‌లోని మెంబర్స్‌కు సమాచారం అందించొచ్చు. ఇన్ఫర్మేషన్ని త్వరగా షేర్ చేయడానికి, గ్రూప్ డిస్కషన్స్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది.