తులసి మొక్కని ఎప్పుడు పూజించాలి, బెస్ట్ టైం ఏది.. ఇవి పాటిస్తే ఇంట్లో లక్ష్మిదేవి ఉన్నట్లే..

తులసి మొక్కని ఎప్పుడు పూజించాలి, బెస్ట్ టైం ఏది.. ఇవి పాటిస్తే ఇంట్లో లక్ష్మిదేవి ఉన్నట్లే..

హిందూ మతంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, చాలామంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతారు. అంతేకాకుండా, ఎవరైతే రోజు తప్పకుండా తులసి మొక్కని పూజించి,  నీరు పోస్తారో... వారికి లక్ష్మీదేవి  ఆశీస్సులు ఉంటాయి. అందుకే పెద్దలు "ఇంట్లో తులసి ఉంటే, లక్ష్మీదేవి ఉన్నట్టే" అని అంటారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సరైన సమయంలో, నిర్దేశించిన ఆచారాల ప్రకారం తులసి మొక్కని పూజిస్తే దాని పూర్తి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా, మీరు పూజా నియమాలను పాటించకపోతే, ఆ ప్రయోజనాలు లభించవు.

తులసి మొక్కని పూజించడం, దీపం వెలిగించడం, నీరు పోయడం వంటి ఆచారాలకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్న ఏమిటంటే: ప్రతిరోజూ పూజ చేయడానికి శుభ సమయం ఏది ?..  అని.... 

తులసి మొక్కని పూజించడానికి అత్యంత శుభ సమయం ఎప్పుడంటే
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తులసి మొక్కని ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలోనైనా పూజించవచ్చు , కానీ పూజకు అత్యంత శుభ సమయం బ్రహ్మ ముహూర్తం నుండి సూర్యోదయం అయిన కొన్ని గంటల వరకు అని భావిస్తారు.

►ALSO READ | అల్లం ఆరోగ్యం: అల్లంతో పులుసు.. చట్నీ.. ఇవి తింటే వర్షాకాలంలో అస్సలు ముక్కు కారదు..!

ఉదయం 4:00 గంటల నుండి 8:00 గంటల మధ్య తులసిని పూజించడం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే, ఏదైనా కారణం చేత మీరు ఉదయం పూజ చేయలేకపోతే, సాయంత్రం కూడా చేయవచ్చు. ఈ సమయంలో మీరు తులసి మొక్కకి నీరు పోయకూడదు. అలాగే మధ్యాహ్నం పూట, గ్రహణం సమయంలో తులసిని పూజించడం మానుకోవాలి.

తులసి మొక్కలో దీపం ఎప్పుడు వెలిగించాలి ?
మీరు బ్రహ్మ ముహూర్తంలో తులసి మొక్క ముందు దీపం వెలిగించవచ్చు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించి హారతి (పవిత్ర ప్రార్థన) కూడా ఇవ్వవచ్చు.

ఇది ఇంట్లో సానుకూల శక్తిని నిలుపుతుంది ఇంకా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరి ఆశీస్సులను ప్రసాదిస్తుంది. తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడానికి అత్యంత శుభ సమయం సూర్యాస్తమయం తర్వాత, కానీ ఈ సమయంలో తులసి మొక్కను తాకకూడదు.

తులసి మొక్కకు నీరు పోయడానికి అత్యంత శుభ సమయం
మీరు బ్రహ్మ ముహూర్తంలో ఉదయం పూట తులసి మొక్కకు నీరు పోయొచ్చు. ఈ సమయంలోనే తులసి  మొక్క అత్యధిక శక్తిని కలిగి ఉంటుంది, మీ జీవితంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రిపూట తులసి మొక్కకు ఎప్పుడూ నీరు పోయకూడదు. ఇలా  చేయడం వల్ల మీ పూజ పూర్తి ప్రయోజనాలు లభించవు, పైగా లక్ష్మీదేవికి కోపం కూడా రావచ్చు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.