వాటర్ బాటిళ్లపై గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? సగం మందికి ఇది తెలీయదు..

 వాటర్ బాటిళ్లపై గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? సగం మందికి ఇది తెలీయదు..

వాటర్ బాటిళ్ల పై ఉండే వంకరటింకర గీతలను చాలామంది కేవలం లుక్  కోసం చేసిన డిజైన్ అనుకుంటారు. కానీ, దీని వెనుక ఒక చక్కటి సైన్స్ దాగుంది. ఒక సాధారణ ప్లాస్టిక్ బాటిళ్లను మరింత ఉపయోగకరంగా మార్చడానికి ఇంజనీర్లు చేసిన ఆలోచన ఇది.

 మనం  ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు లేదా ఆఫీసు, బయటికి వెళ్ళినపుడు దాహం తీర్చుకోవడానికి వాటర్ బాటిళ్లను కొంటూ ఉంటాం. అయితే చాలా వరకు వాటర్ బాటిళ్ల చుట్టూ గీతలు లేదా ఎత్తుపల్లాలు ఉండటం మీరు గమనించే ఉంటారు. ఇవి కేవలం చూడటానికి బాగుండటం కోసం పెట్టినవి కావు. మనం వాడుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి, సీసా గట్టిగా ఉండటానికి ఈ గీతలు ఎంతగానో సహాయపడతాయి....

దీని వెనుక ఉన్న అసలు కారణాలు..

 పట్టుకోవడానికి మంచి గ్రిప్ 
ఫ్రిజ్‌లో పెట్టిన వాటర్ బాటిల్‌ను బయటకు తీసినప్పుడు దానిపై కూలింగ్ చేరి తడిగా మారుతుంది లేదా ఒక్కోసారి మన చేతులకు చెమట పడ్డటం లేదా తడి  ఉంటుంది. అలాంటప్పుడు ప్లెయిన్‌గా ఉన్న వాటర్ బాటిళ్లు చేతిలోంచి జారిపోయే ఛాన్స్ ఉంది. కానీ, ఈ వంకరటింకర గీతలు ఉండటం వల్ల వాటర్ బాటిళ్లను  చేత్తో పట్టుకున్నప్పుడు మంచి  గ్రిప్ దొరుకుతుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు, రన్నింగ్ చేస్తున్నప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు బాటిల్ చేతిలోంచి అస్సలు జారదు.

వాటర్ బాటిళ్లు బలంగా 
సాధారణంగా మనం కొనే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు చాలా పలచని ప్లాస్టిక్‌తో తయారవుతాయి. ఒకవేళ వాటర్ బాటిళ్ ప్లెయిన్‌గా ఉంటే.. మనం కొంచెం గట్టిగా నొక్కగానే అది నలిగిపోతుంది లేదా పగిలిపోతుంది. ఈ వంకర గీతలు వాటర్ బాటిళ్ల  ప్యాకింగ్‌కు ఎక్కువ బలాన్ని ఇస్తాయి. వీటివల్ల వాటర్ బాటిళ్లు నలిగిపోయే అవకాశం 30 శాతం వరకు తగ్గుతుంది.

ఈ గీతల డిజైన్ వల్ల తక్కువ ప్లాస్టిక్‌తోనే వాటర్ బాటిళ్లను గట్టిగా తయారు చేయవచ్చు. దీనివల్ల ప్లాస్టిక్ వాడకం తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. షాపుల్లో లేదా వాటర్ బాటిళ్లను లారీల్లో ట్రాన్స్పోర్ట్  చేసే టైంలో ఒకదానిపై ఒకటి పేర్చినప్పుడు, పైనుంచి పడే బరువు ఒత్తిడికి ఇవి అస్సలు నలిగిపోవు.

కంపెనీ లేబుల్స్ ఈజీగా 
వాటర్ బాటిళ్లపై కంపెనీల పేర్లు ఉండే స్టిక్కర్లు (లేబుల్స్) చూస్తుంటాం కదా! వాటర్ బాటిళ్ల ఉపరితలంపై ఈ గీతలు ఉండటం వల్ల జిగురు బాగా అంటుకుంటుంది. దీనివల్ల స్టిక్కర్లు ముడతలు పడకుండా, ఊడిపోకుండా నీట్‌గా కనిపిస్తాయి. అంతేకాదు, బాటిళ్లను రీసైక్లింగ్  చేసేటప్పుడు ఈ గీతల వల్ల ఆ లేబుల్స్‌ ఈజీగా తొలగించవచ్చు.

తయారీ ప్రక్రియలో ఉపయోగం
ఫ్యాక్టరీల్లో ప్లాస్టిక్‌ను వేడి చేసి ఈ వాటర్ బాటిళ్లను తయారు చేస్తారు. అది చల్లబడేటప్పుడు ప్లాస్టిక్ కాస్త కుంచించుకుపోతుంది. అలాంటప్పుడు లోపల ఉన్న గాలి సులభంగా బయటకు పోవడానికి ఇంకా  వాటర్ బాటిళ్ల ఆకారం పాడవకుండా ఉండటానికి ఈ గీతల డిజైన్ సహాయపడుతుంది.

చాల మందికి మనం రోజూ చూసే ఒక చిన్న ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వెనుక కూడా మన సౌకర్యం కోసం, పర్యావరణ రక్షణ కోసం ఇంత పెద్ద ఇంజనీరింగ్ ఆలోచన దాగుందన్నది తెలియకపోవచ్చు.