ఇది టూమచ్ అమ్మాయి.. బండి అలా తగిలిందని.. డెలివరీ బాయ్ ను చెప్పులతో కొట్టింది..

ఇది టూమచ్ అమ్మాయి.. బండి అలా తగిలిందని.. డెలివరీ బాయ్ ను చెప్పులతో కొట్టింది..

స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను ఓ మహిళ దారుణంగా కొట్టిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో 'ఎక్స్' లో 'ఘర్ కే కలేష్' అనే పేజీలో కనిపించింది. మహిళను బైక్ కొద్దిగా ఢీకొనడంతో ఇదంతా ప్రారంభమైంది. ఈ సమయంలో చుట్టుపక్కల వాళ్లు ఆమెను ఆపడానికి ప్రయత్నించినా ఆ మహిళ మాత్రం.. డెలివరీ బాయ్‌ని షూతో కొట్టడం చూడవచ్చు. ఈ వీడియోలో ఆమె ఎవరి మాటా వినలేనంత కోపంతో ఊగిపోతూ కనిపించింది.

ఈ వీడియో, అప్‌లోడ్ చేసినప్పటి నుంచి 81వేల వ్యూస్ ను దక్కించుకుంది. ఆ మహిళ చేసిన పనికి సోషల్ మీడియాలో పలువురు షాక్ అయ్యారు. "అవాంఛిత హక్కులను అనవసరంగా ఉపయోగించడం" అని ఒక X యూజర్ వ్యాఖ్యానించారు. ఇంత మాత్రానికే అంత కోపమా అంటూ కొందరు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అంతకుముందు నోయిడా సెక్టార్ 14 ఫ్లైఓవర్ సమీపంలో స్విగ్గీ డెలివరీ వ్యక్తిని కారు ఢీకొట్టింది. అంతే కాదు అతను ఈ ప్రమాదంలో దాదాపు 500 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. బాధితుడు కుశాల్, కొత్త సంవత్సరం సందర్భంగా డెలివరీల కోసం బయటకు వెళ్తుండగా, అతని ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, డ్రైవర్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి 500 మీటర్ల దూరంలో ఉన్న ఒక దేవాలయం దగ్గర కారును ఆపాడు. అనంతరం మృతదేహం కిందపడిపోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కౌశల్ సోదరుడు అమిత్ ఫోన్ చేయడంతో కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది. దారిన వెళ్తున్న ఓ వ్యక్తి కాల్‌ను స్వీకరించి ప్రమాదం గురించి తెలియజేశాడు.