Kona Venkat: నేను సంపాదించిన ఆస్తికి.. టాక్స్ లేదు!.. రైటర్ కోన వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kona Venkat: నేను సంపాదించిన ఆస్తికి.. టాక్స్ లేదు!.. రైటర్ కోన వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కోన వెంకట్ (Kona Venkat).. సినీ ఆడియన్స్కు పరిచయం అక్కర్లేని పేరు. 1998 నుంచి 2023 వరకు వరుస విజయాలతో దూసుకెళ్లి స్టార్ రైటర్గా ఎదిగారు కోన వెంకట్. సత్య, ఆంధ్రావాలా, సాంబ, వెంకీ, శివమణి, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఢీ, రెడీ, కింగ్, బాలు, అదుర్స్, దూకుడు, వెంకీ మామ, జై లవకుశ, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు స్టోరీ & డైలాగ్ రైటర్గా పనిచేసి సత్తా చాటాడు కోన. అలాంటి కోన ఇప్పుడు నిర్మాతగా మారి ‘బ్యాండ్‌ మేళం’ సినిమా నిర్మించాడు. ఈ నెల 26న మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్మించగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు కోన.

కోన వెంకట్ మాట్లాడుతూ..‘‘జీవితంలో ఎవ్వరేం ఎక్కువ సంపాదించినా.. ఇన్కమ్ టాక్స్ కట్టాలి. కానీ, నేను సంపాదించిన ఆస్తికి టాక్స్ కట్టాల్సిన అవసరం లేదని’’ కోన వెంకట్ చెప్పారు.

ఇందులో భాగంగా కోన మాట్లాడుతూ.. ‘నేను దాచుకున్న కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవాళ నా కోసం వచ్చిన ప్రతివాళ్లు నేను సంపాదించిన ఆస్తులే. అందులో మొదటగా డైరెక్టర్ వివి వినాయక్. అతన్ని నేను సంపాదించిన ఫస్ట్ ప్రాపర్టీ. అలాగే.. డైరెక్టర్స్ బాబీ కొల్లి, శివ నిర్వాణ, హరీష్ శంకర్, గోపి చంద్ మలినేని, బ్యాండ్‌ మేళం సతీష్.. ఇలా వీళ్ళందరూ నా ఆస్తులే. ఎందుకంటే, సినిమా ఉన్నంత కాలం వీళ్లు ఉంటారు. అలా నా ఆస్తి పెరుగుతూనే ఉంటుందే.. కానీ, తరగదని’ కోన ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

ఈ క్రమంలోనే కోన ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ విసిరారు. ‘బ్యాండ్‌ మేళం’ సినిమా మీకు నచ్చకపోతే నేను నెక్స్ట్ రాసే మూవీ చూడొద్దు అని చెప్పారు. అలా తాను చిరు సినిమాకు పని చేస్తున్న విషయాన్ని వెల్లడించాడు కోన. అయితే, ఈ మాట వింటే రేప్పొద్దున చిరంజీవి గారు ఫోన్ చేసి కోప్పడతారని.. ఎందుకంటే తాను తర్వాత రాయబోయే సినిమా ఆయనదే అని తెలిపారు. బాబీ దర్శకత్వంలో పని చేస్తున్న Mega 158 చిత్రానికి తాను రైటర్ అని కోన వెల్లడించాడు.

అయితే.. ఈ మధ్యన ‘‘ఈ సినిమా నచ్చకపోతే..’ అంటూ సినీ స్టార్స్ చేస్తున్న ఛాలెంజ్లు బాగా పాపులర్ అవుతున్నాయి. ఫస్ట్ నానితో మొదలై, ప్రియదర్శి, ఎన్టీఆర్, నాగవంశీ ఇలా ప్రతి ఒక్కరు ఛాలెంజ్ చేస్తూ వచ్చారు. అయితే, ఇందులో కొన్ని హిట్ కొట్టినవి ఉన్నాయి.. మరికొన్ని ప్లాప్స్ అయినవి ఉన్నవి. ఇక ‘బ్యాండ్‌ మేళం’ ఏ కేటగిరీకి వెళుతుందో చూడాలి.

‘బ్యాండ్ మేళం’ విషయానికి వస్తే..‘కోర్ట్’ చిత్రంతో సక్సెస్ అందుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ మూవీపై మంచి హైప్ ఉంది. శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 26న సినిమా రిలీజ్ కానుంది. రూరల్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సాగే లవ్ స్టోరీగా సినిమా తెరకెక్కింది.

ఇటీవలే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బావమరదలుగా రోషన్, శ్రీదేవి కనిపించనున్నారు. అయితే, వీళ్లిద్దరి అల్లరితో సరదాగా మొదలైన ప్రేమకథలో.. చిన్నపాటి అపార్థాలు దూరం పెంచాయనే పాయింట్‌తో సినిమా రూపొందింది.