టూల్స్ & గాడ్జెట్స్ : మీరు మర్చిపోయినా ఇది మర్చిపోదు.. మొక్కలకు నీళ్లు పోసే యంత్రం వచ్చేసింది..!

టూల్స్ & గాడ్జెట్స్ : మీరు మర్చిపోయినా ఇది మర్చిపోదు.. మొక్కలకు నీళ్లు పోసే యంత్రం వచ్చేసింది..!

మొక్కలకు క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి. కానీ.. చాలామంది వానాకాలంలో వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ.. వర్షం కురవనప్పుడు మర్చిపోకుండా నీళ్లు పోస్తేనే అవి పచ్చగా ఉంటాయి. అందుకోసం ఇలాంటి గాడ్జెట్​ని ఇన్​స్టాల్​ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్​పీఆర్​3 ఎస్​ఎస్​ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఇరిగేషన్ గాడ్జెట్​ని బ్లూటూత్, వై-ఫై సాయంతో ఫోన్​తోనే కంట్రోల్ చేయొచ్చు. అంటే.. ఇంటికి దూరంగా 

ఉన్నప్పడు ఫోన్​లో ఒక్క క్లిక్ ​చేస్తే చాలు.. గార్డెన్​లో మొక్కలన్నింటికీ నీళ్లు అందుతాయి. ఈ గాడ్జెట్​కి రెండు జోన్​లు అంటే రెండు అవుట్ పుట్​ పైపులు ఉంటాయి. దీన్ని గార్డెన్​లోని ట్యాప్​కి బిగించాలి. ఆ తర్వాత అవుట్​పుట్​ జోన్​లకు స్ప్రేయర్​ లేదా స్ర్పింక్లర్​, డ్రిప్​ పైపులను కనెక్ట్‌‌‌‌ చేయాలి. ఇందులో ఆటోమెటిక్​ వాటర్​ టైమర్​ కూడా ఉంటుంది.

►ALSO READ | టూల్స్ & గాడ్జెట్స్ : చెవిలో గుబిలి తీయటానికి వచ్చిన కొత్త పరికరం ఇది..!

అంటే సెట్​ చేసి పెట్టుకున్న టైంకి ప్రతిరోజూ నీళ్లను సప్లై చేస్తుంది. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే రెయిన్​ డీలే ఫీచర్​. అంటే వర్షం కురవని రోజు మాత్రమే నీళ్లు పంప్​ చేస్తుంది. దీన్ని బ్లూటూత్​తో ఆపరేట్​ చేయాలంటే గాడ్జెట్​కు 15 మీటర్లు పరిధిలోనే ఫోన్​ ఉండాలి. లేదంటే వైఫై ద్వారా ఇంటర్నెట్​ కనెక్ట్‌‌‌‌ చేసి ఎక్కడున్నా ఆపరేట్​ చేయొచ్చు. దీన్ని యూఎస్​బీ సాకెట్​తో చార్జ్​ చేసుకోవచ్చు. 

ధర : రూ. 4,795