105 మినిట్స్ చిత్రం జనవరి 26న విడుదల

105 మినిట్స్  చిత్రం జనవరి 26న విడుదల

హన్సిక ఫిమేల్  లీడ్‌‌గా రాజు దుస్సా దర్శకత్వంలో బొమ్మక్ శివ నిర్మించిన చిత్రం ‘105 మినిట్స్’. జనవరి 26న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజు దుస్సా మాట్లాడుతూ ‘సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్‌‌‌‌లో ఈ చిత్రాన్ని రూపొందించాం. రియల్ టైమ్‌‌లో  తీయాలనే ఆలోచన నుంచే ఈ కథ వచ్చింది. చాలా మందికి కథను వినిపించినా.. బొమ్మక్ శివ బాగా నమ్మారు. ఆ తర్వాత హన్సిక స్టోరీ వినగానే ఎక్సైట్ అయ్యి ఒప్పుకోవడం చాలా ఆనందంగా అనిపించింది.

నా బ్యాగ్రౌండ్‌‌ కూడా అడగకుండా.. కథ నచ్చి క్యారెక్టర్‌‌‌‌లో ఎలా చెప్తే అలా చేశారు. ఒక గ్లామర్ గర్ల్‌‌ని చాలా డిఫరెంట్‌‌గా చూపించాం. హీరోయిన్ అంటే సాంగ్స్, రొమాన్స్ అని కాకుండా ప్రతి ఫ్రేమ్‌‌లో పెర్ఫార్మన్స్ ఉంటుంది. స్క్రీన్‌‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఎవరు ఊహించలేరు.  కనిపించని మనిషి పంచభూతాలని గుప్పెట్లో పెట్టుకొని అమ్మాయిని ఏడిపించే ఆటే ఈ సినిమా కాన్సెప్ట్. లైవ్‌‌లో  చూస్తే ఎదురుగా ఏం జరుగుతుందో అలా అనిపించే కథ ఇది. ఒక్క ఫ్రేమ్ కూడా ఎక్కువ రాలేదు కరెక్ట్‌‌గా 105 మినిట్స్‌‌లో కంప్లీట్ చేసాం. ఆడియెన్స్‌‌కు కచ్చింగా డిఫరెంట్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను ఇస్తుంది’ అని చెప్పారు.