11కేవీ లైన్ కు జీ వైరు తగిలిపెద్దేముల్లో రైతు మృతి..వికారాబాద్ జిల్లాలో ఘటన

11కేవీ లైన్ కు  జీ వైరు తగిలిపెద్దేముల్లో రైతు మృతి..వికారాబాద్ జిల్లాలో ఘటన
  •    మరొకరికి గాయాలు 

తాండూరు వెలుగు : వికారాబాద్​జిల్లా పెద్దేముల్ మండల గోపాల్‌‌పూర్ శివారులో ఆదివారం కరెంట్​షాక్​తో ఓ రైతు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. గ్రామానికి చెందిన తింసాన్‌‌పల్లి బిచ్చప్ప (38), ఇతడి తమ్ముడు అశోక్ వారి పొలంలో కొత్త ట్రాన్స్‌‌ఫార్మర్ వద్ద సర్వీస్ వైరు రిపేర్​చేస్తున్నారు.

 అశోక్ చెట్టుపైకి ఎక్కి అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగిస్తుండగా, బిచ్చప్ప కింద సర్వీస్ వైరు సరిచేస్తున్నాడు. జీ వైరు పైనున్న 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్‌‌కు తగలడంతో ​షాక్​తో బిచ్చప్ప అక్కడికక్కడే చనిపోయాడు. చెట్టుపై నుంచి దిగే క్రమంలో అశోక్‌‌కు స్వల్పంగా గాయపడ్డాడు.