మీద పడిన కోతుల గుంపు : భయంతో ఆగిన 12 ఏళ్ల బాలుడి గుండె

మీద పడిన కోతుల గుంపు : భయంతో ఆగిన 12 ఏళ్ల బాలుడి గుండె

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా కోతుల గుంపు మీద పడటంతో 12 ఏళ్ళ బాలుడి గుండె ఆగింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురంలో జరిగింది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... మల్లాపురం గ్రామానికి చెందిన మొక్క వీరబాబు కుమారుడు 12ఏళ్ళ నిషాంక్ గౌడ్ శుక్రవారం ( అక్టోబర్ 23 ) సాయంత్రం అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా కోతుల గుంపు దాడి చేసింది.

కోతుల కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో భయపడ్డ నిశాంక్ గుండెపోటుతో మృతి చెందాడు. కోతులు దాడి చేసిన సమయంలో నిశాంక్ కిందపడటాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే నిశాంక్ మృతి చెందినట్లు నిర్దారించారు డాక్టర్లు.

కోతుల గుంపు మీద పడ్డ సమయంలో నిశాంక్ బయపడ్డాడని, భయంతో గుండెపోటు రావడంతోనే నిశాంక్ మృతి చెందాడని తెలిపారు డాక్టర్లు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.